భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి : కలెక్టర్‌

భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి : కలెక్టర్‌

భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి : కలెక్టర్‌ప్రజాశక్తి – గూడూరు టౌన్‌ /కోట గూడూరు డివిజన్‌ పరిధిలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, భూ వివరాల నమోదులో అధికారులు అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ లక్ష్మీ శ హెచ్చరించారు. సోమవారం సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో డివిజన్‌ స్థాయి ‘స్పందన’ జరిగింది. కలెక్టర్‌ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రత్యేక ప్రతిభావంతుడు ట్రైసైకిల్‌ కావాలని కలెక్టర్‌ను కోరగా, వెంటనే తిరుపతి నుంచి పంపించాలని కలెక్టర్‌ ఆదేశించారు. 18 సంవత్సరాలు వయస్సు నిండిన వారు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిరణ్‌కుమార్‌, రూరల్‌ సిఐ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. శ్రీనివాస మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దు గూడూరు మండల పరిధిలో చెన్నూరు గ్రామ పరిధిలో ఉన్న శ్రీనివాస మైనింగ్‌కు అనుమతులు ఇవ్వొద్దని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం అధ్యక్షులు డేగా రవి రాఘవేంద్ర కలెక్టర్‌ లక్ష్మీశకు వినతిపత్రం అందజేశారు. ఇటీవల చెన్నూరు గ్రామ పరిధిలోని దండోరా వేయకుండా గోప్యంగా శ్రీనివాస మైనింగ్‌లో పబ్లిక్‌ హియరింగ్‌ నామమాత్రంగా జరిగిందన్నారు. కొత్తపట్నం రైతులకు నష్టపరిహారం అందించాలి చెన్నై, బెంగళూరు కోస్టల్‌ కారిడార్‌ భూములకు సంబంధించిన రైతులకు నష్టపరిహారం అందించాలని కొత్తపట్నం ఉప సర్పంచ్‌, మాజీ జెడ్పిటిసి ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌ అన్నారు. సోమవారం కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీకి చెందిన సర్పంచ్‌ ఈదురు తిరుపాలయ్య, ఉప సర్పంచ్‌ ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌ గూడూరు డివిజన్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి లక్ష్మీశను కలిసారు. చెన్నరు- బెంగళూరు కోస్టల్‌ కారిడార్‌ భూములకు చెందిన రైతులకు తక్షణమే 254 ఎకరాలకు నష్టపరిహారం అందించాలని వినతి పత్రాన్ని అందజేశారు. అధికారుల దృష్టికి తీసుకెళుతూనే ఉన్నా, ఇంతవరకూ పట్టించుకోలేదన్నారు.

➡️