మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శన

మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ ప్రదర్శనప్రజాశక్తి – గూడూరు టౌన్‌, యంత్రాంగంఏ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సి.ఐ.టి.యు) ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి ఇచ్చిన పిలుపుమేరకు తిరుపతి జిల్లా గూడూరులో మంగళవారానికి మున్సిపల్‌ పారిశుద్య కార్మికుల నిరవధిక సమ్మె ”8వ రోజుకు” చేరుకుంది. సమ్మె శిబిరం నుంచి టవర్‌క్లాక్‌ సెంటర్‌ వరకూ అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్‌ రాష్ట్ర కమిటి సభ్యులు బి.గోపీనాథ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని, కాలయాపన చేస్తే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు బివి రమణయ్య, జోగి శివకుమార్‌, బి.రమేష్‌, ధారా కోటేశ్వరరావు, పెంచల ప్రసాద్‌, ఎం.సంపూర్ణమ్మ, సుబ్బమ్మ, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. – సూళ్లూరుపేటలో సిఐటియు జిల్లా నాయకులు ఎ.పుల్లయ్య సంఘీభావం ప్రకటించారు. కనీస వేతనం 26వేలు, గ్రాడ్యుటీపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అధికారులు అక్కడక్కడ పోటీ కార్మికులను దింపుతామని హెచ్చరించడం సబబు కాదన్నారు. కౌన్సిలర్లు, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని కోరారు. కె.సాంబశివయ్య, సిహెచ్‌ సుధాకర్‌రావు, శామ్యూల్‌ పాల్గొన్నారు.- నాయుడుపేటలో మున్సిపల్‌కార్యాలయం నుంచి కార్మికులు అర్ధనగంగా బస్టాండ్‌ వరకూ నిర్వహించారు. సిఐటియు జిల్లా నాయకులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమ్మె చేపట్టి ఎనిమిది రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేరుతో సాగదీస్తోందన్నారు. మేస్త్రిలు కార్మికులపై పెత్తనం చెలాయిస్తున్నారని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కరోనా అనంతరం తొలగించిన 70 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఆరుగురి మున్సిపల్‌ కార్మికులకు పిఎఫ్‌ డబ్బులు చెల్లించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారన్నారు. ఏడుగురికి ఆరు నెలలుగా పెండింగ్‌ వేతనాలు ఇవ్వలేదన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు మహేష్‌బాబు, నెలవల మస్తానయ్య, తేజ, మైలారి శ్రీనివాసులు పాల్గొన్నారు. నేటి మున్సిపల్‌ సమ్మెకు సిద్ధం : ఎఐటియుసి పుత్తూరు టౌన్‌ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎఐటియుసి తలపెట్టిన సమ్మెకు సిద్ధంగా ఉన్నామని యూనియన్‌ గౌరవాధ్యక్షులు డి.మహేష్‌ తెలిపారు. సిఎం హామీలు నెరవేర్చే వరకూ సమ్మె కొనసాగుతుందని చెప్పారు. యాకోబు, అంకయ్య, ప్రభాకర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

➡️