రూ. రెండు కోట్లు విలువ చేసే నిషేధిత సిగరెట్లు పట్టివేత

రూ. రెండు కోట్లు విలువ చేసే నిషేధిత సిగరెట్లు పట్టివేత

రూ. రెండు కోట్లు విలువ చేసే నిషేధిత సిగరెట్లు పట్టివేత ప్రజాశక్తి -తిరుపతి సిటీ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలి స్తున్న రెండు కోట్ల విలువగల నిషేధిత సిగరెట్ల ను జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంటు అధికా రులు స్వాధీనం చేసు కున్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సు మెంటు రీజనల్‌ అధికారి ఈశ్వర్‌ రెడ్డి సూచనల మేరకు విజిలెన్స్‌ అధికారులు గురువారం రాత్రి చెన్నై కోల్‌కత్తా నేషనల్‌ హైవే లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ భారీ కంటైనర్‌ లో ఎలాంటి బిల్లులు అనుమతులు లేకుండా వెళుతున్న నిషేధ సిగరెట్లు గుర్తించారు. సంబంధిత వాహనదారుల వద్ద ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాటిని సీజ్‌ చేశారు. వాటి విలువ కోటి 81 లక్ష 35 వేల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ తనిఖీలలో ఇన్‌స్పెక్టర్‌ రవి, చంద్రశేఖర్‌, నాగ సురేష్‌, విజరు కుమార్‌, డీఈఈ పాల్గొన్నారు.

➡️