రైల్వే ఉద్యోగులకు ఒపిఎస్‌ అమలు చేయాలి

రైల్వే ఉద్యోగులకు ఒపిఎస్‌ అమలు చేయాలి

రైల్వే ఉద్యోగులకు ఒపిఎస్‌ అమలు చేయాలి రేణిగుంట : రైల్వే ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ వర్కుషాపు డివిజనల్‌ సెక్రటరీ సురేంద్రరెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం సిఆర్‌ఎ గేటు ముందు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. తమ డిమాండ్ల సాధనకై ఈనెల 8-11 తేదీల్లో రిలే నిరాహారదీక్షలు చేపడతామన్నారు. నూతన పెన్షన్‌ విధానం వల్ల కార్మికులకు సామాజిక భద్రత లేకుండా పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి, ఉదరురారు, హెన్రిపాల్‌ పాల్గొన్నారు.

➡️