లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత – ఇప్పటికైనా అధికారులు స్పందించాలి- భూ పరిరక్షణ కమిటీ డిమాండుప్రజాశక్తి-తిరుపతి(మంగళం): రేణిగుంట మండల పరిధిలోని లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాలను లిడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణ కమిటీ నేతలు, దళిత సంఘాల నాయకులు కలిసి కూల్చి వేశారు. దళితుల కోసం కేటాయించిన భూమిలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న సమాచారంతో సోమవారం అక్కడికి చేరుకున్న పిసిసి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడపేర చిట్టిబాబు, రూరల్‌ తహశీల్దారు సుబ్రహ్మణ్యంకు సమాచారం అందించారు. తహశీల్దారు ఆదేశాలతో వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ సందర్భంగా లిడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ పి సుబ్బయ్య మాట్లాడుతూ ఎంతోకాలంగా భూ కబ్జాదారులు ఈ భూమిపై కన్నేశారని, వరుస సెలవులు కావడంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. లీడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణకు చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చిట్టిబాబు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో ఆక్రమణ దారులు తరచూ భూ కబ్జాకు యత్నిస్తున్నారన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి దళితులకు కేటాయించిన లీడ్‌ క్యాప్‌ భూముల పరిరక్షణకు కంచె నిర్మాణం చేపట్టాలని అధికారులను డిమాండు చేశారు. మాదిగ మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మాసారపు గోపి, కాటయ్య, గంగాధరం, వివిధ దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు.

Dec 25,2023 23:02
లిడ్‌ క్యాప్‌ భూముల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - ఇప్పటికైనా అధికారులు స్పందించాలి- భూ పరిరక్షణ కమిటీ డిమాండు

➡️