విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ)

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ)

విభజించి పాలించేందుకే సీఏఏ!సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన భారత పౌరసత్వ సవరణ (సిఎఎ) చట్టం విభజించి పాలించేందుకేనని ముస్లీం మైనార్టీలు, మేధావులు, లౌకికవాదులు మండిపడ్డారు. దీనివల్ల దేశ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. బిజెపి మూడోసారి అధికారంలోకి రావడానికి పాచికగా సిఎఎ చట్టాన్ని వాడుకుంటోందన్నారు. 2020లో ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబకడంతో వెనక్కి తీసుకుందన్నారు. సిఎఎ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ‘ప్రజాశక్తి’ లౌకికవాదులను పలకరించగా మరోసారి ఆందోళనకు సమాయత్తం అవుతున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సిఎఎ చట్టాన్ని వ్యతిరేకించి, తాము చేసే పోరాటానికి అండగా నిలవాలని కోరారు. ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌, శ్రీకాళహస్తిప్రజాస్వామ్యవాదులంతా ఏకమవ్వాలి రఫీ హిందుస్తానీ, జీవకోన బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన సిఎఎ చట్టాన్ని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలి. 2020లో ఈ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చినపుడు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద 42 రోజుల పాటు శాంతియుతంగా ఆందోళన చేశాం. మేధావులు, కవులు, రచయితలు అందరూ సంఘీభావం తెలిపారు. ఈ చట్టం కావాలని ఎవరూ కోరుకోవడం లేదు. బిజెపి లబ్ది కోసమే చట్టాన్ని తీసుకొచ్చారు. రద్దు చేసేంత వరకూ పోరాడతాం. బిజెపి ప్రయోజనాల కోసమేచింతామోహన్‌, కేంద్ర మాజీ మంత్రి సిఎఎ చట్టం బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసమే. మూడోసారి అధికారంలోకి రావడం కష్టమని తెలిసే బిజెపి హిందూ ముస్లీంల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మూడేళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చినపుడు దేశవ్యాప్తంగా నిరసనలతో దద్దరిల్లింది. ఇపుడు మళ్లీ అదే చట్టాన్ని తీసుకొచ్చి దేశ ప్రయోజనాల కోసం కాకుండా ముస్లీం, మైనార్టీలు, దళితులు, క్రిష్టియన్లను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది. ఈ పదేళ్లలో బిజెపి ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకొచ్చి దేశ ప్రతిష్టను దిగజార్చింది. సిఎఎ చట్టం పనికిమాలిన చట్టం. లౌకికవాదులు తిప్పికొట్టాలి పి.అంజయ్య, రిపబ్లికన్‌ పార్టీ బిజెపి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నుతోంది. సిఎఎ చట్టాన్ని రద్దు చేయాలని లౌకికవాదులంతా ఏకమవ్వాలి. ఈ చట్టం వల్ల ముస్లీంలు, క్రిష్టియన్లు, దళితుల హక్కులను కాలరాసేలా ఉంది. ఈ దేశం నుంచి ముస్లీంలను వెళ్లగొట్టడానికి బిజెపి కుట్ర పన్నుతోంది. దేశంలో మతం పేరుతో దాడులు జరుగుతున్నాయి. బిజెపి మౌనంగా ఉంటూ ఇలాంటి చట్టాల ద్వారా అగ్గికి ఆజ్యం పోస్తోంది. చట్టం అమలు కాకుండా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. రాబోయే ఎన్నికల్లో బిజెపికి గెలుపు కష్టంగా ఉండటం వల్లనే సిఎఎ చట్టాన్ని తీసుకొచ్చింది. ఎన్నికల కోసమే..వి.నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం కేవలం ఎన్నికల లబ్ది కోసమే. దేశంలో మత విద్వేషాలు పేరుతో రెచ్చగొట్టి లబ్ది పొందాలని చూస్తుంది. సిఎఎ చట్టాన్ని సిపిఎం మొదటినుంచి వ్యతిరేకరిస్తూనే ఉంది. గతంలో జరిగిన ఆందోళనల్లోనూ సిపిఎం ప్రత్యక్షంగా పాల్గొంది. మోడీ ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు విసిగిపోయారు. రానున్న ఎన్నికల్లో బిజెపికి ఓటమి భయం పట్టుకుంది. అందుకోసమే సిఎఎ చట్టం పేరుతో లబ్ది పొందాలని చూస్తోంది. ప్రజాస్వామ్యవాదులంతా తిప్పికొట్టాలి. చట్టం రద్దయ్యేవరకూ సిపిఎం ఉద్యమిస్తుంది.ఆర్‌ఎస్‌ఎస్‌ సానుభూతి కోసమే మురళి, సిపిఐ జిల్లా కార్యదర్శిబిజెపి ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ సంతోషం కోసమే సి ఏ ఏ చట్టాన్ని అమలు చేస్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని తీసు కొచ్చినప్పుడు దేశ వ్యాప్తంగా లౌకికవాదులంతా ఉద్యమించారు. దేశ ప్రయోజనాలు పక్కనపెట్టి బిజెపి తన సొంత ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చి హిందువుల ఓట్లను కొల్లగొట్టడానికి కుట్ర పన్నింది. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా అల్లర్లు జరుగుతున్న దాన్ని అదుపు చేయలేని పరిస్థితిలో కేంద్రం ఉంది. సిఎఎ చట్టం రద్దయ్యే వరకూ సిపిఐ మైనార్టీలకు అండగా ఉంటుంది.సిఏఏ ఎన్నికల డ్రామా: ఎస్‌ఎం షరీఫ్‌, ప్రజాతంత్ర వాది భారత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆగమేఘాలపై అమలు చేయాలని చూడడం ఎన్నికల డ్రామానే. అనాదిగా బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ముస్లిం మైనారిటీలపై ఉక్కు పాదం మోపేందుకు మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. 1956 భారత పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వం కోరే శరణార్థులకు కొన్ని నిబంధనల మేర పౌరసత్వం ఇచ్చే వెసులుబాటు ఉండేది. అయితే బిజెపి ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన సీఏఏ చట్టం భారత్‌ పొరుగు దేశాల నుంచి వచ్చే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, పార్శీలు, జైనులు, బౌద్ధులకు మాత్రమే భారత పౌరసత్వం వర్తించేలా చేయడం దుర్మార్గమైన చర్య. భిన్నత్వంలో ఏకత్వాన్ని కోరే భారతదేశానికి శరణార్థులుగా వచ్చే ముస్లింలకు మాత్రం సిఏఏ చట్టం వర్తించకపోవడం ముమ్మాటికి బిజెపి ఎన్నికల కుట్రే.సిఏఏ చట్టంపై టిడిపి సమాధానం చెప్పాలి : గాదిపాకుల కిరణ్‌, వైసిపి ఎస్సీ సెల్‌దేశవ్యాప్తంగా కేంద్రంలో చేస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై బిజెపితో జతకడుతున్న టిడిపి, జనసేన తమ వైఖరి చెప్పాలనీ, ఆ తర్వాతే ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్లాలి. ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై ఆ రెండు పార్టీలు తమ వైఖరిని చెబితేనే ప్రజలు వద్దకెళ్లి ఓటడిగే హక్కు వారికి ఉంటుంది. మతపరమైన గొడవలు సృష్టించడానికే : ఐఎస్‌ మౌల మజీద్‌ ఎ నూరాని బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లీంపై ఏదో ఒక విధంగా దాడులు చేస్తూనే ఉంది. సిఎఎ చట్టం తీసుకొచ్చి హిందూ ముస్లీంల మధ్య గొడవలు సృష్టించి రానున్న ఎన్నికల్లో లబ్ది పొందడానికే కుట్ర పన్నారు. ముస్లీంలు ఎవరూ బిజెపి ప్రభుత్వాన్ని సమర్థించడం లేదు. ఎన్నికల్లో ముస్లీంల సత్తా ఏమిటో ఓటు రూపంలో తెలియజేస్తాం. సిఎఎ వ్యతిరేకించే రాజకీయ పార్టీలకే మా మద్దతు ఉంటుంది. చట్టం రద్దయ్యే వరకూ అందరూ సహకరించాలి. చట్టం రద్దయ్యేవరకూ పోరాడతాం : మౌలానా మజీదే, తిరుపతి కేంద్రం తీసుకొచ్చిన సిఎఎ చట్టాన్ని ప్రతి ముస్లీం వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టం రద్దు చేసేంత వరకూ పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడేళ్ల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చినపుడు తిరుపతి మసీదులో ఉండే ముతవల్లిలు, ముస్లీం పెద్దలు నగరంలో ర్యాలీ నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మసీదులో ప్రార్థనలతో నిరసనలు తెలిపారు. ఇపుడూ అదే పద్ధతులు పాటిస్తాం. దేశంలో హిందూ ముస్లీంలు కలసి మెలసి ఉన్నారు. ఈ చట్టం ఎవరికీ అవసరం లేదు.

➡️