వైభవం…శివోత్సవం..!ఎటు చూసినా శివ నామస్మరణేవేలాదిగా తరలి వచ్చిన భక్తులు

వైభవం...శివోత్సవం..!ఎటు చూసినా శివ నామస్మరణేవేలాదిగా తరలి వచ్చిన భక్తులు

వైభవం…శివోత్సవం..!ఎటు చూసినా శివ నామస్మరణేవేలాదిగా తరలి వచ్చిన భక్తులుప్రజాశక్తి-శ్రీకాళహస్తి ‘హర హర మహదేవా… శంభో శంకరా’ అంటూ శివనామస్మరణలు… స్వర్ణాభరణాలతో దేదీప్యమానమై వెలుగుతున్న శివపార్వతులను చూసి తరించి పోయే భక్తజనం… స్వర్ణముఖినదిలో పుణ్యస్నానాలు…పితదేవతలకు తర్పణం సమర్పించే భక్తులు… శంఖం పూరించే జంగం దేవరలు… ఇలా ఎటు చూసినా భక్త జన సందోహమే. మహాశివరాత్రి సందర్భంగా సద్యోముక్తి క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. శ్రీకాహస్తీశ్వర ఆయలంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శుక్రవారం వాయులింగేశ్వరుడు నిత్యాభిషేక మూర్తియై భక్తులకు దర్శనమిచ్చారు. పండుగ వేళ స్వామి వారికి ఉదయం ప్రథమ, ద్వితీయ కాలాభిషేకాలతో పాటు ఉచ్చికాలాభిషేకం, సాయంత్రం ప్రదోష కాలాభిషేకం నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి నవాభిషేకాలు చేశారు. మహాశివరాత్రి పురస్కరించుకుని వేకువ జామున 2గంటలకే మంగళ వాయిద్యాలు, మేళ తాళాల మధ్య ఆలయ అర్చకులు పవిత్ర మంత్రోచ్ఛరణలు చేస్తూ స్వామివారిని మేల్కొలిపారు. ఆ తరువాత గోపూజ నిర్వహించారు. ఆ తరువాత సర్వదర్శనానికి అనుమతించారు. ఉదయం 5గంటల నుంచి 10.30గంటల మధ్య స్వామి, అమ్మవార్లకు ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో పాటు క్షీరాభిషేకం, పచ్చకర్పూర అభిషేకం, పంచామత అభిషేకం ఒకదాని వెంట ఒకటి స్వామివారికి వరుసగా చేశారు. ఈ అభిషేకాలతో స్వామివారు తన భక్తులకు నిత్యాభిషేక మూర్తిగా తన భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే భక్తులు స్వామీ అమ్మవార్లను దర్శించుకున్నారు.పోలీసుల ఓవరాక్షన్‌మహాశివరాత్రి బ్రహ్మౌత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు చేపట్టిన ఏర్పాట్లు అన్నీ విఫలమయ్యాయి. సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆలయమంతా ఎక్కడపడితే అక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, అవగాహన లేకపోవడం, నాయకులు, పోలీసుల జోక్యం ఎక్కువ కావడంతో దర్శనాలు గందరగోళంగా మారాయి. మహా శివరాత్రి బ్రహ్మౌత్సవాల సందర్భంగా సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తామని చెప్పిన అధికారులు, ధర్మకర్తల మండలి మాటలు గాలికి కొట్టుకు పోయాయి. పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రత్యేకంగా క్యూలు నిర్మిస్తున్నామని చెప్పిన మాటలు వధా అయిపోయాయి. అయినవారికే అంతరాలయాల దర్శన భాగ్యం కలిగింది. పోలీసుల ఓవరక్షన్‌తో సామాన్య భక్తులు ఇబ్బంది పడ్డారు.అమ్మవారి సన్నిధికి వెళ్లడానికి మెట్లు దిగే క్రమంలో కొందరు తూలి పడిపోవడం, తోపులాట జరగడం అరుపులు కేకలు వేసుకోవడం జరిగాయి. తీరా అమ్మవారిని దర్శించుకోకుండానే పోలీసులు వారిని నెట్టి వేయడంతో భక్తులు మనస్థాపానికి గురయ్యారు. మహా లఘు దర్శనం అందరికీ అమలు చేసి ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేది. నాయకులతో పాటు పోలీసులు, కొందరు ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు గుంపులు గుంపులుగా దర్శన ప్రత్యేక దర్శనాలకు తీసుకురావడం అంతరాలయం వరకు వెళ్లడం జరిగింది. ప్రతి శివరాత్రికి మధ్యాహ్నం వరకు సుమారు 70 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకునేవారు. అయితే ఈసారి ఆ సంఖ్య 50వేలకు కూడా చేరువ కాలేదని సమాచారం. అయినా భక్తులు అవస్తలు పడాల్సి వచ్చింది. భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఈవో నాగేశ్వరరావు దృష్టికి మీడియా తీసుకెళ్ళినా మౌనం వహించడం గమనార్హం.శివరాత్రి రోజే ధర్మకర్తల మండలి ప్రకటనశ్రీకాళహస్తీశ్వరాలయానికి మళ్లీ ధర్మకర్తల మండలిని నియమిస్తూ రాష్ట్ర దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలిలో 16మంది సభ్యులకు స్థానం కల్పించారు. ఇందులో గత మండలిలో ఉన్న వారే 12మంది ఉండటం విశేషం. నలుగురికి మాత్రమే కొత్తవారికి స్థానం కల్పించారు. మండలి సభ్యులతో పాటు తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించారు. ఈ ధర్మకర్తల మండలి పదవీకాలం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఏడాది పాటు ఉండనుంది. గత ధర్మకర్తల మండలి పదవీకాలం గత నెల 29వ తేదీ నాటికి ముగియడంతో మళ్లీ మండలి ఏర్పాటు చేశారు. ఈ ధర్మకర్తల మండలిలో అంజూరు తారక శ్రీనివాసులు, జల్లి క్రిష్ణయ్య, ఎన్‌.జయశ్యామ్‌, కొండూరు కష్ణకుమార్‌, సి.ప్రకాశం పంతులు, పసల సుమతి, దాసరి జయమ్మ, ఎస్‌.లక్ష్మి, ఎం.రమాప్రభ, వి.చెంచులత, కొండూరు సునీత, జె.భారతి, పెద్దిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి, పి.సుబ్బరామగుప్త, ఆలంపాటి శ్రీనివాసులు, ఎక్స్‌ అఫిసియో సభ్యులుగా ఎస్‌ఎంకే శ్రీకాళహస్తీశ్వర గురుకుల్‌ ను నియమించారు. సభ్యులందరూ కలసి మండలి ఛైర్మన్‌ గా అంజూరు తారక శ్రీనివాసులును ఎన్నుకోనున్నారు. కాగా గత ధర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉన్న సాధన మునస్వామి, ఎన్‌.మునిలక్ష్మి, కేసరి చిన్న సుబ్బారెడ్డి, ఎం.మహిధర్‌ రెడ్డిని తప్పించారు. వీరి స్థానంలో కొత్తగా కొండుగారి కష్ణకుమార్‌, జె.భారతి, పి.సుబ్బరామగుప్త, ఆలంపాటి శ్రీనివాసులుకు స్థానం కల్పించారు. ఇక ధర్మకర్తల మండలితో పాటు చింతామణి పవన్‌ కుమార్‌ (పాండు), ఎన్‌.సుబ్రహ్మణ్యం, కె.శోభ, పి.నీల, పుట్టు లీలావతి, కె.మీనాక్షి, ఎస్‌.పవన్‌ కుమార్‌,. కంఠా ఉదయ కుమార్‌ అనే తొమ్మిది మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

➡️