శిబిరాల్లోనే అంగన్‌వాడీలు

శిబిరాల్లోనే అంగన్‌వాడీలు

శిబిరాల్లోనే అంగన్‌వాడీలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ నూతన సంవత్సరం రోజున అంగన్‌వాడీలు శిబిరాల్లోనే కుటుంబాలకు దూరంగా సమ్మెలో కొనసాగారు. 2023, డిసెంబర్‌ 12న ప్రారంభించిన నిరవధిక సమ్మె, 2024, జనవరి ఒకన న్యూ ఇయర్‌ రోజూ కొనసాగింది. అయినా జగన్మోహన్‌రెడ్డికి తమ పట్ల కనికరం లేదని వాపోయారు. కుటుంబాల్లో వేడుక చేసుకోవాల్సిన అంగన్‌వాడీలు, శిబిరాల్లో కేక్‌ కట్‌ చేసి సిఎం జగన్మోహన్‌రెడ్డి కనికరం చూపాలని వేడుకున్నారు. కొత్త సంవత్సరంలో సిఎం జగన్మోహన్‌రెడ్డితో తేల్చుకుంటామని, లేదంటే సిఎంనే మార్చేస్తామని హెచ్చరిస్తున్నారు. – తిరుపతిలో సాష్టాంగ నమస్కారం చేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సోమవారానికి అంగన్‌వాడీల సమ్మె 21వ రోజుకు చేరుకుంది. వెంకటేశ్వర స్వామి జగన్మోహన్‌రెడ్డి మనస్సు భార్చాలని, తమ జీతభత్యాల సమస్య పరిష్కరించాలని నినాదాలు చేశారు. హాకర్స్‌ యూనియన్‌నగర ప్రధాన కార్యదర్శి పి.బుజ్జి, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి తంజావూరు మురళి మద్దతు ప్రకటించారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్‌, అంగన్వాడీలు సుజిత, గోమతి, ఎల్లమ్మ, అరుణ, గీత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు-శ్రీకాళహస్తిలో ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరంలో న్యూ ఇయర్‌ సందర్భంగా కేక్‌ కట్‌ చేశారు. కొత్త ఏడాదిలో అయినా జగన్‌ బుద్ధి మారి తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. నాయకులు అంగేరి పుల్లయ్య, రేవతి, పుష్ప, సౌజన్యం, రాజా, సక్కుభాయమ్మ, స్వర్ణ పాల్గొన్నారు. – రేణిగుంటలో సమ్మె శిబిరంలో న్యూ ఇయర్‌ వేడుక జరుపుకున్నారు. ‘లేచింది మహిళా లోకం’ పాటకు స్టెప్పులతో దుమ్ములేపారు. న్యూ ఇయర్‌ రోజు ఉపవాసం చేస్తూ రిలే దీక్షను కొనసాగించారు. మధ్యాహ్నం కేక్‌ కట్‌ చేశారు. ధనమ్మ, భాగ్యలక్ష్మి, ప్రభావతి, పాండురంగమ్మ, అంబిక, విజయ, ధరణి, రేఖ, ఉష, రాధమ్మ, భారతి, సిఐటియు నాయకులు హరినాథ్‌ పాల్గొన్నారు. – గూడూరు టౌన్‌లో సిఐటియు నాయకులు ఎస్‌.సురేష్‌, అంగన్‌వాడీ అధ్యక్షురాలు ఎ.ఇంద్రావతి ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది. – నాయుడుపేటలో కొత్త సంవత్సరం రోజున ఇంట్లో లేకపోయాం అని బాదధతో మౌనంగా శిబిరంలో కూర్చుని నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు శివకవి ముకుంద, అంగన్‌వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎన్‌.శ్యామలమ్మ, నాగమణి, పెంచలమ్మ, పాల్గొన్నారు. వెంకటగిరిలోనూ సమ్మె కొనసాగింది.

➡️