‘సిద్ధం’గా ‘రాజీ’నామా !ఎన్నికల్లో యాక్టివ్‌గా వాలంటీర్లుఉమ్మడి జిల్లాలో వందమందిపైనే రిజైన్‌

'సిద్ధం'గా 'రాజీ'నామా !ఎన్నికల్లో యాక్టివ్‌గా వాలంటీర్లుఉమ్మడి జిల్లాలో వందమందిపైనే రిజైన్‌

‘సిద్ధం’గా ‘రాజీ’నామా !ఎన్నికల్లో యాక్టివ్‌గా వాలంటీర్లుఉమ్మడి జిల్లాలో వందమందిపైనే రిజైన్‌ప్రజాశక్తి – తిరుపతిఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వాలంటీర్లు ఎలక్షన్‌ విధుల్లో పాల్గొనకూడదంటూ ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన పలువురు వాలంటీర్లు ‘ సిద్దం ‘ అంటూ పెద్ద ఎత్తున రాజీనామాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వందమందిపైనే రిజైన్‌ చేసినట్లు అధికార వర్గాల సమాచారం. రెండు రోజుల వ్యవధిలో దాదాపు 50 మంది రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలోకి దిగుతుండటం గమనార్హం. వీరికి ‘ రాబోయేది మన పార్టీనే. మీ భవిష్యత్తుకు పూచీ మాది. ఒకవేళ ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తే మీకు వాలంటీర్ల జాబ్‌ లు వుండవు కదా!. ” అంటూ అధికార పార్టీ నేతలు అభయం ఇస్తూ ఎన్నికల ముగ్గులోకి దించుతుండడం గమనార్హం.వాలంటీర్లు అధికార పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో, పార్టీ ప్రచారాల్లో పాల్గొనటం రివాజుగా మారిన నేపథ్యంలో టీడీపీ నేతలు ఈసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ నేతలు అధికారులను కోరారు. దీనిపై స్పందించిన ఇసి ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని వాలంటీర్లను ఆదేశించింది. ఆయా జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసి ఎన్నికల ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లు ఉండరాదు అంటూ హుకుం జారీ చేసింది. అయితే ఇదేమి పట్టని అధికార యంత్రాంగం చూసి చూడనట్టు వ్యవహరించిన నేపథ్యంలో మరోసారి ఈసీ కొరఢా జులిపించింది. ఇక లాభం లేదని అధికార పార్టీ నేతలు వాలంటీర్లు ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ”రాబోయేది మన పార్టీయే కదా.. మీకెందుకు భయం. మీకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఈసారి గంపగుత్తగా ఓట్లు అన్ని మనకే పడేలా చేసే బాధ్యత మీది. రాజీనామాలు చేసి ధైర్యంగా ఎన్నికల్లోకి రండి”అంటూ బహుమతులు ఇచ్చి మరి ఆహ్వానిస్తున్నారు. మరికొందరిని నయాన్నోభయాన్నో తమ దారికి తెచ్చుకుని రాజీనామాలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఊతమిస్తూ రెండు రోజుల కాలంలో పెద్ద ఎత్తున వాలంటీర్లు రిజైన్‌ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో వాలంటీర్లపై టీడీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీడీపీ నేత బొజ్జల సుధీర్‌ వాలంటీర్లపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బొజ్జల సుధీర్‌ స్థానికంగా మాట్లాడుతూ వాలంటీర్లను జిహాదీలతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. తమపై చేసిన ఈ వ్యాఖ్యలను ఆయన వెనక్కి తీసుకోవాలని వాలంటీర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

➡️