ఇంటర్‌ సప్లిమెంటరీకి 591 మంది గైర్హాజరు

ఇంటర్‌ సప్లిమెంటరీకి 591 మంది గైర్హాజరు ప్రజాశక్తి -తిరుపతి సిటీ శుక్రవారం ప్రారంభమైన ఇంటర్‌ ద్వితీయ, ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలలో జిల్లావ్యాప్తంగా 591 మంది విద్యార్థులు పరీక్షలకు గైరహాజరయ్యారని ఆర్‌ ఐ ఓ ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరిగిన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 983 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షలకు 872 మంది హాజరయ్యారని, 111 మంది గైరహాజరయ్యారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగిన ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు 7220 మంది దరఖాస్తు చేసుకోగా 6,740 మంది హాజరయ్యారని, 480 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వెల్లడించారు.

➡️