అంకిత భావంతో సేవలందించాలికలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు

అంకిత భావంతో సేవలందించాలికలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు

అంకిత భావంతో సేవలందించాలికలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ ప్రభుత్వ ఉద్యోగులు అంకితభావంతో ప్రజలకు సేవలందించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ మైన్స్‌ అండ్‌ జియాలజీ కి ఉద్యోగోన్నతిపై బదిలీపై వెళుతున్న ప్రవీణ్‌కుమార్‌ను సహచర ఉద్యోగులు, అధికారులు వీడ్కోలు పలుకుతూ అభినందనలు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రవీణ్‌కుమార్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఏ విధమైన విధివిధానాలు అవలంబించామనేది డాక్యుమెంటేషన్‌ చేయడం, రాబోయే ఎన్నికల నిర్వహణకు దిక్సూచిగా ఉపయోగ పడుతుందన్నారు. తాను కలెక్టర్‌గా మూడుసార్లు పనిచేసి, నాలుగోసారి కలెక్టర్‌గా ఇసిఐ ఆదేశాల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఛాలెంజిగా తీసుకున్నట్లు చెప్పారు. నీతి నిజాయతీగా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు వెన్నుదన్నుగా ఉంటానన్నారు. జెసి ధ్యానచంద్ర, డిఆర్‌ఒ పాల్గొన్నారు.

➡️