విలువిద్యలో స్ప్రింగ్‌ డేల్‌ విద్యార్థిని ఘనత

విలువిద్యలో స్ప్రింగ్‌ డేల్‌ విద్యార్థిని ఘనత

విలువిద్యలో స్ప్రింగ్‌ డేల్‌ విద్యార్థిని ఘనతప్రజాశక్తి-తిరుపతి(మంగళం)తిరుపతి-కరకంబాడి మార్గం చెన్నాయిగుంట గ్రామ సమీపంలో ఉన్న స్ప్రింగ్‌ డేల్‌ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ప్రియా ప్రణవి ఈ నెల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్‌ 10 ఇండియన్‌ రౌండ్‌ బాలుర కేటగిరి ఆర్చరీ పోటీలో మొదటి స్థానం సంపాదించుకుని జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల నిర్వాహకులు కేఎస్‌ వాసు సంతోషం వ్యక్తం చేశారు. తమ విద్యార్థి జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక అవడం పాఠశాలకు గర్వకారణం అన్నారు. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగేలా పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రిన్సిపాల్‌ కే.ఆర్‌. అనురాధ గోపాల్‌, హెడ్‌ మిస్ట్రెస్‌ వి.ప్రమీల కష్ణన్‌, ఏఓ కే. చంద్రశేఖర్‌, పిఆర్‌ఓ టి.సాంబ శివ రెడ్డి పాల్గొన్నారు.

➡️