ఖాతాదారులకు డివిడెంట్లు అందిస్తాం

ఖాతాదారులకు డివిడెంట్లు అందిస్తాం

ఖాతాదారులకు డివిడెంట్లు అందిస్తాంప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంకులో ఉండే ఖాతాదారులు అందరికీ డివిడెంట్లు త్వరలో అందిస్తామని ఆ బ్యాంకు వైస్‌ చైర్మన్‌ వాసు యాదవ్‌ ప్రకటించారు. శనివారం తిరుపతి కో-ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ ఆవరణంలో ఖాతాదారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్మన్‌ రామారావు ఊర్లో లేకపోవడంతో వైస్‌ చైర్మన్‌ వాసు యాదవ్‌ ఇన్చార్జి చైర్మన్గా ఈ సమావేశానికి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన ఖాతాదారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ టౌన్‌ బ్యాంక్‌ పరిధిలో సుమారు 40 కోట్ల రూపాయలు మొండి బకాయిలు వసూలు చేయడంతో డివిడెంట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మొండిబకాయలపైనే పనిచేయడం జరిగిందన్నారు. టౌన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ వైస్‌ చైర్మన్‌ కార్యాలయాన్ని మద్యం బార్‌గా మార్చారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టౌన్‌ బ్యాంక్‌ డైరెక్టర్లు మహమ్మద్‌ ఖాసిం, అత్తూరు సురేష్‌ రెడ్డి ,వెంకటేష్‌ రాయల్‌, అనిల్‌ కుమార్‌ రాయల్‌, మబ్బు నాదం రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, పి నాగిరెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు.

➡️