8న భారత ప్రధాని రేణిగుంటకు రాక

8న భారత ప్రధాని రేణిగుంటకు రాక

8న భారత ప్రధాని రేణిగుంటకు రాక ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌భారత ప్రధాని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వర్చువల్‌ విధానంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ నుండి కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, ఎస్పి కష్ణ కాంత్‌ పటేల్‌ పాల్గొని వివరిస్తూ భారత ప్రధాని పర్యటనకు మార్గదర్శకాల మేరకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు భారత ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు చేపట్టాలని, ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్బంగా కలెక్టర్‌ వివరిస్తూ తిరుపతి విమాశ్రయానికి భారత ప్రధాని మే8 న మధ్యాహ్నం చేరుకుని రాజంపేట పబ్లిక్‌ మీటింగ్‌ కొరకు హెలికాప్టర్‌ లో బయల్దేరి వెళ్లి పాల్గొని తిరిగి సాయంత్రం తిరుపతి విమానాశ్రయం చేరుకుని విజయవాడకి బయల్దేరి వెళతారని, అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

➡️