కాంగ్రెస్‌ సత్తా చాటుతాం సత్యవేడు కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబు

కాంగ్రెస్‌ సత్తా చాటుతాం సత్యవేడు కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబు

కాంగ్రెస్‌ సత్తా చాటుతాం సత్యవేడు కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబు ప్రజాశక్తి – పిచ్చాటూరు (సత్య వేడు) సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ సత్తా ఏమిటో చూపిస్తామని నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబు పేర్కొన్నారు. నియోజకవర్గ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడంతో బుధవారం కాంగ్రెస్‌ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తనను అభ్యర్థిగా ప్రకటించినందుకు రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లలో నియోజకవర్గంలో వైసిపి, టిడిపిలు దోచుకుని దాచుకున్నాయే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. నిన్నటివరకూ వైసిపిలో ఉన్న ఎంఎల్‌ఎ ఆదిమూలం ఐదేళ్ల పాటు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేశారని విమర్శించారు. ఇపుడు టిడిపి గూటికి చేరి ఈసారి తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు.

➡️