తడలో సిఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

Dec 21,2023 13:22 #Tirupati district
cm jagan birth day celebrations tada

ప్రజాశక్తి-తడ :  వైఎస్ఆర్సీపీ నాయకుల అధ్వర్యంలో తడ మండలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను సూళ్లూరుపేట శాసన సభ్యులు కిలివేటి సంజీవయ్య మరియు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి విచ్చేసి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తడ బొడిలింగాల పాడు రోడ్డు వద్ద స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తడ బస్టాండ్ వద్ద భారీ కేక్ కట్ చేసిన అనంతరం అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోవైఎస్ఆర్సీపీ నాయకులు జే సి యస్ కన్వినర్ సుందర్ రెడ్డి, తడ సర్పంచ్ మరియు మండల కన్వినర్ ఆర్ముగం, జయకుమార్ రెడ్డి, మునస్వామి రెడ్డి తదితరులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️