అడవిలో కంటైనర్‌

అడవిలో కంటైనర్‌

అడవిలో కంటైనర్‌ప్రజాశక్తి – బాలాయపల్లిఅడవిలో కంటైనర్‌ ఉందని పోలీసులకు గ్రామ స్తులు సమాచారం ఇవ్వడంతో ఇటు రెవిన్యూ, అటు పోలీస్‌ శాఖ అధికారులు పరుగులు తీసిన సంఘటన మండలంలోని నిడిగల్లు గ్రామ పంచాయితీ అడవి సమీపంలోని బోయినగుంట వద్ద చోటు చేసుకుంది. తహసిల్దార్‌ పుల్లా రావు వివరాల మేరకు… మూడు రోజుల నుంచి కంటైనర్‌ బోయిన గుంట అటవీ ప్రాంతంలో ఉందని గ్రామస్తులు సమాచారం మేరకు పోలీసులు సహాకారంతో సంఘటన స్థలానికి వెళ్లి కంటైనర్‌ కి ఉన్న తాళం పగులగొట్టి చూడగా ఖాళీగా ఉంది. కంటైనర్‌ను అడవిలో ఎందుకు ఉంచారు. ఎలక్షన్లకు ఏమైనా నగదు, మందు తరలించారా? అనే కోణంలో విచారిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఐ మహబూబ్‌ సాహెబ్‌, ఆర్‌ ఐ పూర్ణ, విఆర్‌ఓ శ్రీనివాసులురెడ్డి ఉన్నారు.

➡️