ఫీల్డ్‌ అసిస్టెంట్లు తొలగించే అధికారం లేదు : ఎంపిడివో

ఫీల్డ్‌ అసిస్టెంట్లు తొలగించే అధికారం లేదు : ఎంపిడివో

ఫీల్డ్‌ అసిస్టెంట్లు తొలగించే అధికారం లేదు : ఎంపిడివో ప్రజాశక్తి -వెంకటగిరి రూరల్‌ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలగించడం మా పరిధిలో లేదని వెంకటగిరి మండల అభివద్ధి అధికారి నీలకంఠేశ్వరరావు బుధవారం తెలిపారు. ప్రభుత్వం మారినప్పుడు నుండి ఉపాధి హామీ క్షేత్ర సహాయకులను తొలగిస్తారని అపోహలకు ప్రజాశక్తి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు ఎంపీడీవో వివరించారు, ఉపాదా హామీ పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని తద్వారా నిరుపేదలు నిత్యం ప్రభుత్వం ఇచ్చిన కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు కూలి వస్తుందని ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు తొలగించాలన్న, నియమించాలన్న మా పరిధిలో ఉండదని జిల్లాస్థాయి ప్రాజెక్టు అధికారి నిర్ణయం అనుసరించి ఉంటుందని, ఏదైనా ప్రోగ్రెస్‌ ప్రకారమే చర్యలు ఉంటాయని తెలియజేశారు. అనంతరం మండలంలోని పాలింకోట పాలకొండ సత్రం, పెట్లూరు మొగల్గుంట, పంజాం గ్రామాల పరిశీలించి రానున్న వర్షాలు కారణంగా సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

➡️