టిటిడి జేఈవోగా బాధ్యతలు చేపట్టిన గౌతమి

టిటిడి జేఈవోగా బాధ్యతలు చేపట్టిన గౌతమి

టిటిడి జేఈవోగా బాధ్యతలు చేపట్టిన గౌతమిప్రజాశక్తి – తిరుపతి బ్యూరో: తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి జేఈవోగా (విద్య,వైద్యం) ఎం.గౌతమి మంగళవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పలు ఐఏఎస్‌లు బదిలీ అయిన విషయం తెలిసిందే. 2014 బ్యాచ్‌కి చెందిన ఎం.గౌతమికి టిటిడి తిరుపతి జేఈవోగా పోస్టింగ్‌ ఇచ్చారు. మంగళవారం ఇన్చార్జి జేఈవో వీరబ్రహ్మం నుంచి బాధ్యతలు స్వీకరించారు. గతంలో జేఈఓగా పనిచేసిన సదాభార్గవి స్థానంలో గౌతమి వచ్చారు. ఎండోమెంట్‌ రెవెన్యూ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న గౌతమిని తిరుపతికి పోస్టింగ్‌ ఇచ్చారు.

➡️