మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగం ఉండదు : చింతామోహన్‌

మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగం ఉండదు : చింతామోహన్‌

మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగం ఉండదు : చింతామోహన్‌ప్రజాశక్తి – సత్యవేడు మరోసారి మోడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే రాజ్యాంగం ఉండదని కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి ఎంపి అభ్యర్థి చింతామోహన్‌ అన్నారు. సత్యవేడు కాంగ్రెస్‌ అభ్యర్థి బాలగురవం బాబును ఆశీర్వదించాలన్నారు. సత్యవేడు టవర్‌క్లాక్‌ వద్ద చింతామోహన్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, గత పదేళ్లుగా మోడీ పాలనలో ప్రజాస్వామం కనిపించకుండా పోయి ధనికులకు, పెట్టుబడిదారులకు సహాయ పడుతోందన్నారు. మోడీ పెట్టుబడిదారులకు ప్రధానిగా ఉన్నారని, పేదలకు కాదన్నారు. అవినీతి ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాడని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని, కచ్చితంగా తిప్పి కొడతారన్నారు. పత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందన్నారు. జర్నలిజాన్ని పెట్టుబడిదారులు సమాధి చేస్తున్నారన్నారు. భారతదేశాన్ని బిజెపి సర్వనాశనం చేసిందని, ఎవరికీ స్వేచ్ఛ లేదన్నారు. ప్రశ్నించిన వారు జైల్లో ఉంటున్నారని, కేజ్రీవాల్‌, కెసిఆర్‌ కూతురు పరిస్థితి గమనిస్తే అర్ధమవుతుందన్నారు. ఎలక్షన్ల ముందే వారిని అరెస్టు చేయడమనేది రాజకీయ కక్షసాధింపు చర్యన్నారు. రాష్ట్రంలో టిడిపి, వైసిపిలకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనన్నారు. బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఎస్సీ, ఎస్టీ, ఒబిసి మైనార్టీ రిజర్వేషన్లు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చల్లదొరై, దాము, రఘు పాల్గొన్నారు.

➡️