ఇండియా కూటమి విస్తృత ప్రచారం

ఇండియా కూటమి విస్తృత ప్రచారం

ఇండియా కూటమి విస్తృత ప్రచారంప్రజాశక్తి- తిరుపతి సిటి ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి పి.మురళి ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఎస్టీవి నగర్‌, న్యూ ఇందిరానగర్‌, ఎయిర్‌ బైపాస్‌ రోడ్డు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారాన్ని, సిపిఐ సీనియర్‌ నేత బి.తులసేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర నేత, సీపిఐ సీనియర్‌ నాయకులు, తులసేంద్ర మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారుచౌకగా అమ్మి వేయడం బ్రిటిష్‌ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్‌ కోడ్‌లుగా మార్చి కార్మికులను కట్టు బానిసలు చేయడం జరిగిందని అలాంటి బీజేపీని దేశం నుండి తరిమి కొట్టాలన్నారు. దేశంలో కాంగ్రెస్‌ నాయకత్వంలో 26 రాజకీయ పార్టీలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ సిపిఐ, సిపిఎం ఆమ్‌ఆద్మీ వికేసి పార్టీలు కలిసి తిరుపతిలో సీపీఐ పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం జరిగిందని అందరం కలిసి మురళిని గెలిపించుకోవడం ద్వారా తిరుపతి అభివద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సిపిఐ అభ్యర్థి పి.మురళి మాట్లాడుతూ వైసిపి పాలనలో మురికివాడల పరిస్ధితి కడు దయనీయంగా వుందని, దానికి నిదర్శనం ఎస్టీవి నగర్‌, న్యూ ఇందిరా నగర్‌ వాసులకు కనీస వసతులు కల్పించక పోవడమేనన్నారు. నేటికీ ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వుందని తెలిపారు. లైబ్రరీ సెస్‌ కడుతున్నా లైబ్రరీలు మూసివేయడం కార్పోరేషన్‌ నిర్లక్ష్యమన్నారు. తిరుపతి ఎంఎల్‌ఏగా గెలిపిస్తే నగర సమగ్రాభివధ్ధికి కషి చేస్తానని పేర్కొన్నారు. మునిసిపల్‌ కార్మికులకు ఇంటి స్థలాలు, పక్కా ఇండ్లు నిర్మాణానికి కషి చేస్తానని తెలిపారు. రాష్ట్రం నుండి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అలాగే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి ప్రభుత్వంతో మిలాకత్‌ అయిన తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని చిత్తుచిత్తుగా ఓడించవలసిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి.జనార్ధన్‌, నగరి కార్యదర్శి విశ్వనాథ్‌, సిపిఎం నగర్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, ఎఐటియుసి అధ్యక్ష కార్యదర్శులు, చంద్రశేఖర్‌ రెడ్డి, రాధాకష్ణ, సిపిఎం నాయకులు మాధవకష్ణ, వేణుగోపాల్‌, బుజ్జి, వాసు, వెంకటేష్‌, సిపిఐ నాయకులు బండి చలపతి, ఎన్‌డి రవి, శ్రీరాములు పాల్గొన్నారు.

➡️