జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అవినీతి చక్రవర్తి టీటీడీ ఛైర్మన్‌ భూమన

జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అవినీతి చక్రవర్తి టీటీడీ ఛైర్మన్‌ భూమన

జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అవినీతి చక్రవర్తి టీటీడీ ఛైర్మన్‌ భూమన ప్రజాశక్తి -తిరుపతి సిటీ: జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు పచ్చి దొంగ, అరాచక శక్తి, అవినీతి చక్రవర్తి అని టిటిడి చైర్మన్‌ భూముల కరుణాకర్‌ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తాను దోచుకున్న డబ్బుల్లో 30 కోట్ల రూపాయలు పవన్‌ కల్యాణ్‌ కి లంచంగా ఇచ్చి సీటు తెచ్చుకున్న వ్యక్తి ఆరణి శ్రీనివాసులు అని విమర్శించారు. చిత్తూరులో జేబు దొంగతనాలతో జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి, ఎమ్మెల్యే అయిన తర్వాత చిత్తూరు మునిసిపల్‌ ఆఫీస్‌ ను స్వాహా చేశారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా శ్రీనివాసులు స్వాహా మీద ప్రముఖంగా ప్రచురించాయి అని గుర్తు చేశారు. కాంట్రాక్టులన్నీ తనకే తీసుకుని దోచుకున్న ఘనుడు. భూకబ్జాలకు ప్రధాన నాయకుడు ఆరణి శ్రీనివాసులు. హత్యా రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వాడు. చిత్తూరు సంస్కతిని తిరుపతి కి తీసుకు రావాలని చూస్తున్నాడు. చిత్తూరుకు చెందిన రెండు వేల మంది అరాచక శక్తులు, గూండాలను తిరుపతి వీధి వీధిలో తిప్పుతున్నాడు. అనేక ప్రాంతాల్లో భయోత్పాతం చేస్తున్నాడు. ప్రతి రోజూ కాలుదువ్వే ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు. దొంగలే సుద్ధులు చెబుతున్నట్టు అన్నీ తానే చేస్తూ ఎస్పీ దగ్గరికి, ఎలక్షన్‌ కమిషన్‌ దగ్గరకు వెళ్లి కంప్లైంట్‌ చేస్తున్నాడు. ఈ దొంగను తిరుపతి ప్రజలే తరిమి తరిమి కొడతారు. ఇతనికి చిత్తూరులో సీటు ఇస్తే గెలిచే పరిస్థితి లేదని, ఓడిపోవడం ఖాయమని, చిత్తూరు ప్రజలు నీపై ఉమ్మేస్తున్నారని మా నాయకుడు సీటు ఇవ్వలేదు. సీటు రాకపోతే నా దగ్గర కొచ్చి అన్నా నాకు నువ్వే దిక్కు అంటూ నన్ను ప్రాధేయపడిన వాడు ఈ ఆరణి శ్రీనివాసులు అని పేర్కొన్నారు. తను దోచుకున్న డబ్బులో కొంత పవన్‌ కల్యాణ్‌ కి ఇచ్చి, సీటు తెచ్చుకుని, వీర ప్రగల్భాలు పలుకుతున్నాడు. జీవకోన ప్రాంతంలో అమాయకులైన మా కార్యకర్తలను, ఓటర్లను ఓటు వేయకపోతే చంపుతాం, నరుకుతాం అని ఫోన్లలో బెదిరిస్తున్నారు. అక్కడున్న గూండాలు, ఇక్కడ మేమే సామంత రాజులం అని చెప్పే వాళ్లు. ఇలాంటివన్నీ ఇక్కడ సాగే ప్రసక్తి లేదు. ఇలాంటి ముఠా గాళ్లను, నేరగాళ్లను ఉక్కు పాదంతో అణచి వేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. పారామిలటరీ దళాలను తీసుకొచ్చి, ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన భాధ్యత మీది. తిరుపతి పవిత్రను కాపాడండి. ఈ ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నీతివంతమైన పాలన చేస్తాడంట. అరాచక శక్తులు అణచివేస్తాడంట. సరిగ్గా వినపడని వ్యక్తి, కరెక్ట్‌ గా ఎవరినీ గుర్తించే పరిస్థితి కూడా లేని వ్యక్తి ఆరణి శ్రీనివాసులు తనకు తానే గాంధీ వారసుడుగా ప్రకటించు కుంటున్నాడని ఎద్దేవ చేశారు. తిరుపతిని అవినీతి రహితంగా మారుస్తా అంటున్నాడు. తిరుపతిలో మంచి పాలన తీసుకొస్తానని సుద్ధులు చెబుతున్నాడు. తిరుపతి పవిత్రతను కాపాడండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️