శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ప్రజాశక్తి- తిరుమల : తెలంగాణ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతో ఉన్న మోడీ, కెసిఆర్‌, జగన్‌లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రజల ప్రేమను గెలుచుకోవాలేగానీ అహంకారం చూపకూడదని, ప్రజలకు సేవచేస్తే ఆదరించి గెలిపిస్తారని పేర్కొన్నారు. ఇడి, సిబిఐలను వాడుకుని గెలవాలనుకున్న బిజెపికి ప్రజలు గుణపాఠం నేర్పారని అన్నారు. పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసారి ఎన్నికల్లో మేలు చేసే నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని అన్నారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

➡️