నాసా పోటీలలో ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ

నాసా పోటీలలో 'నారాయణ' విద్యార్థుల ప్రతిభ

నాసా పోటీలలో ‘నారాయణ’ విద్యార్థుల ప్రతిభ ప్రజాశక్తి -తిరుపతి సిటీ: అమెరికాలోని నాసా వారు నిర్వహించిన అంతర్జాతీయ పేస్‌ సెటిల్మెంట్‌ కాంటెస్ట్‌లో పాల్గొని తిరుపతి నారాయణ పాఠశాల విద్యార్థులు రూపొం దించిన మిషన్‌ స్పైడర్‌కు హానరబుల్‌ మెన్షన్‌ అవార్డు లభించింది. ఈ సందర్భంగా స్థానిక న్యూ బాలాజీ కాలనీ ఏబిపీ క్యాంపస్‌ లో ఆ పాఠశాల ఏజిఎం కిషోర్‌, ఆర్‌ఐ వసంత్‌ మాట్లాడుతూ మన దేశ భవిష్యత్తుకు పునాదులుగా ఉన్న యువతలో స్పేస్‌ టెక్నాలజీ పై అవగాహన కల్పించడం, మానవాళికి ఉపయోగపడే సాంకేతిక అవసరాలను ప్రజలకు తెలపడం తద్వారా శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడంలో విద్యార్థి దశమించే వారిలో సజనాత్మకతను వెలికి తీయడమే నారాయణ సంస్థల లక్ష్యం అని తెలిపారు. విద్యార్థులకు అభినందనలు తెలిపి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ షాహిద్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మీద 11 ప్రాజెక్టులు సెలెక్ట్‌కాగా అందులో రెండు ప్రాజెక్టులు తిరుపతి జిల్లా వే కాగా, ఆ రెండు ప్రాజెక్ట్‌ లు నారాయణ ఏబిపి క్యాంపస్‌, నగరి నారాయణ బ్రాంచి రెండు నారాయణ పాఠశాలకు చెందినవి కావడం విశేషమని తెలిపారు.

➡️