పెద్దిరెడ్డిని రాజకీయ భూస్థాపితం చేయాలి – మైనార్టీలకు న్యాయం చేస్తాం – గల్లీ రాజకీయాలు వద్దు మిధున్‌ రెడ్డి -అభివద్ధి కోసం పొత్తు అవసరం- టిడిపి నేతలపై కేసులు పెట్టడంతో గుండె రగులుతోంది-మాజీ సీఎంలు బాబు, కిరణ్‌

May 7,2024 22:56
పెద్దిరెడ్డిని రాజకీయ భూస్థాపితం చేయాలి - మైనార్టీలకు న్యాయం చేస్తాం - గల్లీ రాజకీయాలు వద్దు మిధున్‌ రెడ్డి -అభివద్ధి కోసం పొత్తు అవసరం- టిడిపి నేతలపై కేసులు పెట్టడంతో గుండె రగులుతోంది-మాజీ సీఎంలు బాబు, కిరణ్‌

పెద్దిరెడ్డిని రాజకీయ భూస్థాపితం చేయాలి – మైనార్టీలకు న్యాయం చేస్తాం – గల్లీ రాజకీయాలు వద్దు మిధున్‌ రెడ్డి -అభివద్ధి కోసం పొత్తు అవసరం- టిడిపి నేతలపై కేసులు పెట్టడంతో గుండె రగులుతోంది-మాజీ సీఎంలు బాబు, కిరణ్‌ ప్రజాశక్తి -పుంగనూరు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని రాజకీయంగా పుంగనూరు ప్రజల భూస్థాపితం చేయాలని కోరుతూ టిడిపి జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో భాగంగా స్థానిక గోకుల్‌ సర్కిల్లో మంగళవారం మాజీ సీఎంలు ఇద్దరు బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టిడిపి అభివృద్ధి వైపు, వైసిపి అవినీతి వైపు పయనిస్తున్న విషయాన్ని ఓటర్లు గుర్తుంచుకోవాలన్నారు. పుంగనూరు ప్రజలకు ఏమాత్రం రోషమున్న పాపాల పెద్దిరెడ్డి రాజకీయంగా భూస్థాపితం చేయాలన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు నాయకులు లెక్కలేనన్ని కేసులు పెట్టారని వారందరికీ అండగా నిలబడేమని ప్రతి ఒక్క దానికి పెద్దిరెడ్డి రుణం తీర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తిన్న అవినీతి సొమ్మంతా జూన్‌ 4 తర్వాత కక్కిస్తామన్నారు. మైనార్టీలకు ఎప్పుడూ టిడిపి ప్రభుత్వం అన్యాయం చేయదని ఎప్పుడూ వారి అండగా ఉంటామని తెలిపారు. మైనార్టీ నాలుగు శాతం పరిరక్షణ కోసం కషి చేస్తామన్నారు. మోజోన్లకి, హిమాములకు ఆర్థిక సాయం కూడా అందిస్తామన్నారు. ఎన్డీఏ కూటమితో రాష్ట్ర అభివద్ధి కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఎంపీ మిథున్‌ రెడ్డి ఢిల్లీలో సి ఏ ఏ మద్దతు తెలిపి పార్లమెంట్లో ప్రసంగించి గల్లీలో మాత్రం ఓట్ల కోసం విమర్శించడం తగునా అని ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకంలో రాజముద్ర మాత్రమే ఉండాలని, జగన్‌ ఫొటో ఎందుకు అవసరమని ప్రజలకు చూపిస్తూ ప్రశ్నించారు. ప్రజలు వద్దని చెప్పడంతో పట్టాదారు పాసు పుస్తకాలు చింపివేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ జీవో కూడా ప్రతులను చించి వేశారు. టిడిపి అధికారంలోకొచ్చిన వెంటనే రాజముద్రన పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ జీవోను రద్దు చేస్తామన్నారు. మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి నియోజకవర్గ రైతులను నట్టేట ముంచాడని పాల లెక్కలను గణాంకాల్లో తెలిపారు. ల్యాండు, శాండు, ఖనిజం అన్ని రకాల దోపిడీలు చేయడం తప్పితే మరి ఏమీ సాధించింది లేదన్నారు. అంతేకాకుండా టిడిపి పరిపాలనలోఉన్నప్పుడు తంబళ్లపల్లి పుంగనూరు నియోజక వర్గాలు రోడ్లు నిర్మాణానికి ప్రపోజల్స్‌ పెడితే వాటిని మంజూరు చేయించుకుని పిఎల్‌ ఆర్‌ ప్రాజెక్టు పేరుతో పనులు చేసి దోచుకున్నారు తప్పితే వారు చేసిందేమీ లేదన్నారు. రైతుల దగ్గర దోచుకుంది మాత్రమే అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ వీటిని గమనించి రాబోవు ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటుకు కమలం గుర్తుకు, పుంగనూరు శాసనసభకు సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకుడు మాదిరాజు వెంకటరమణ రాజు, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి ప్రదీప్‌ రాజు, వాల్మీకి సంఘ నాయకుడు,విశ్రాంత డిఎస్పి సుకుమార్‌ బాబు, మైనార్టీ నాయకుడు సయ్యద్‌ సుహెల్‌ బాష సివిరెడ్డి, మాధవరెడ్డి, శ్రీకాంత్‌, దేశాధి ప్రకాష్‌, పోలీస్‌ గిరి, కుమార్‌ పాల్గొన్నారు.

➡️