పెద్దపంజాని పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

పెద్దపంజాని పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ

పెద్దపంజాని పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: స్వారత్రిక ఎన్నికల నేపధ్యంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్‌ పోలీసు స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పని తీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్‌ లో నిర్వహిస్తున్న కేసు డెయిరీ, విలేజ్‌ రోస్టర్‌, వివిధ క్రైమ్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు స్టేషన్ల పరిధులు, భౌగోళిక స్థితిగతులు, క్రిటికల్‌ పోలింగు స్టేషన్లు, తాజా పరిస్థితులు, తదితర వివరాలను తెలుసుకున్న పెద్దపంజాని పోలిస్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా ఎలాంటి అలసత్వం లేకుండా ఎన్నికల విధులు నిర్వర్తించాలని, క్షేత్ర స్థాయిలో ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులు వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని, అక్రమ రవాణాను అరికట్టుటకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల ట్రబుల్‌ మాంగర్స్‌, రౌడీ షీటర్లను వెంటనే బైండోవర్‌ చేసి, వారి కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టాలి. నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. సాయుధ దళాలతో రూట్‌ మార్చ్‌ నిర్వహించి, ప్రజలు వారి ఓటు హక్కు ను స్వేచ్ఛగా నిర్భయంగా వినియోగించుకునేలా భరోసా కల్పించాలి. గ్రామాలకు వచ్చు, పోయే అనుమానిత, కొత్త వ్యక్తుల సమాచారం సేకరించాలని సూచించారు.

➡️