షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల్లో వేగం పెంచండి

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల్లో వేగం పెంచండి

షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాల్లో వేగం పెంచండి ప్రజాశక్తి-శ్రీకాళహస్తి స్థానిక ధర్మరాజుల స్వామి ఆలయం వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనుల్లో వేగం పెంచాలని ఆలయ ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతకు రాజీపడరాదన్నారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామనీ, పనులు పూర్తయితే ఆలయానికి ఆదాయ వనరులు సమకూరుతాయని శ్రీనివాసులు చెప్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు ఏఈ వేణుగోపాల్‌, వర్క్‌ ఇన్స్పెక్టర్‌ బాలాజీ, కాంట్రాక్టర్‌ భాస్కర్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️