పద్మావతిలో ముగిసిన శిక్షణ

పద్మావతిలో ముగిసిన శిక్షణ

పద్మావతిలో ముగిసిన శిక్షణ ప్రజాశక్తి – క్యాంపస్‌ : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం సంఘ సంక్షేమం, ఎంఎస్‌డబ్ల్యూ విద్యార్ధినులకు నిర్వహిస్తున్న కమ్యూనికేషన్‌ సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనింగ్‌ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆర్‌. మీరా మాట్లాడుతూ సోషియల్‌ ఆక్టవిస్ట్‌ గా ఆమె అనుభవాలను వివిధ రకముల సోషియల్‌ వర్క్‌ ప్రాక్టీసు గురించి విపులంగా తెలిపారు. సోషల్‌ వర్క్‌ కోర్సు చదవడం వల్ల సమాజం లోని ప్రజలు సమస్యలు లోతుగా, శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం చేసి, సమస్యా తీవ్రతను తెలుసుకుని ఆచరణలో పెట్టడానికి ఉపయుక్క్తమని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రసిడెంట్‌ డా. పి. తవితా తులసీ, అసోసియేషన్‌ ఫ్యాకల్టీ అడ్వైసర్‌ గా ప్రో. లలిత కుమారి, ఛైర్పర్సన్‌ అర్‌. మునేశ్వరి ఎం.స్‌. దబ్లు ఫైనల్‌ , సెక్రటరీ బి. భాగ్యలక్ష్మి, ఎం.స్‌. దబ్లు ప్రీవియస్‌, ట్రషరర్‌, ఎం. సునీత ఎం.స్‌. దబ్లు ఫైనల్‌ , మ్మాగ్జియెన్‌ స్రిక్రిటరీ, ఎల్‌. ఆశ్రిత, జె. పావని, డా . మల్లేశ్వరమ్మ,వజీహభాను, విద్యార్థినులు పాల్గొన్నారు.

➡️