ఓ (పో)టెత్తిన ఉత్సాహంఉదయాన్నే పలుచోట్ల ఇవిఎంల మొరాయింపుచాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగిన పోలింగ్‌గుడిపాలలో వైసిపి ఏజెంట్‌పై కత్తిపోట్లుకొన్నిచోట్ల వైసిపి, టిడిపి కవ్వింపులు

ఓ (పో)టెత్తిన ఉత్సాహంఉదయాన్నే పలుచోట్ల ఇవిఎంల మొరాయింపుచాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగిన పోలింగ్‌గుడిపాలలో వైసిపి ఏజెంట్‌పై కత్తిపోట్లుకొన్నిచోట్ల వైసిపి, టిడిపి కవ్వింపులు

ఓ (పో)టెత్తిన ఉత్సాహంఉదయాన్నే పలుచోట్ల ఇవిఎంల మొరాయింపుచాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగిన పోలింగ్‌గుడిపాలలో వైసిపి ఏజెంట్‌పై కత్తిపోట్లుకొన్నిచోట్ల వైసిపి, టిడిపి కవ్వింపులురామచంద్రాపురం మండలంలో గాల్లోకి కాల్పులుసూళ్లూరుపేటలో వృద్ధ మహిళపై లాఠీ ప్రతాపంఅభ్యర్థుల భవితవ్యం భద్రంగా ‘ఈవిఎం’ల్లో..ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో, యంత్రాంగం హమ్మయ్యా.. ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురు ఘటనలు మినహా సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రామచంద్రాపురం మండలంలో గాల్లోకి కాల్పులు, నాయుడుపేట మండలంలో ఓ వృద్ధురాలిపై లాఠీ తగలడం, చిత్తూరు జిల్లా గుడిపాలలో వైసిపి ఏజెంట్‌ సురేష్‌పై టిడిపి నాయకులు కత్తిపోట్లకు పాల్పడటం జరిగింది. శ్రీకాళహస్తి నియోజవర్గంలో వైసిపి, టిడిపి కవ్వింపులు స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. తిరుపతిలో వైసిపి శ్రేణులు దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేయడంతో కూటమి నాయకులు అడ్డుకున్నారు. దొంగోట్లు వేయడానికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొడ్డాపురం వీధిలో ఇద్దరికి దేహశుద్ధి చేశారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఓట్ల పండుగలా ఎన్నిక జరిగింది. ఎండల ప్రభావంతో ఉదయాన్నే 6 గంటలకే క్యూలైన్లలో ఓటర్లు కనిపించడం గమనార్హం. ఓటింగ్‌ ప్రారంభించే సమయానికే ఉదయం 7 గంటలకు కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో భారీ క్యూలైన్లు తలపించాయి. అయితే ఉదయం 9 గంటల పైన జరిగిన తీరు గమనిస్తే షామియానాలు పూర్తిస్థాయిలో వేయకపోవడం వల్ల చాలాచోట్ల మండుటెండలో ఓటర్లు అగచాట్లు పడ్డారు. కొన్నిచోట్ల కనీసం తాగునీటి వసతి కూడా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. వృద్ధులకు కనీసం ప్రత్యేక లైన్‌ లేకపోవడంతో మండుటెండలో నిలబడలేక చాలా చోట్ల ఇబ్బందులు పడటం కనిపించింది. సాయంత్రం 6 గంటలకల్లా ఓటింగ్‌ సమయం ముగియాల్సి ఉండగా, చాలాచోట్ల రాత్రుల్లోనూ కొనసాగింది. కొన్నిచోట్ల ఓటు వేయడానికి ఓటర్లు దాదాపు రెండు మూడు గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడం గమనార్హం. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్‌ ఎస్వీ క్యాంపస్‌ స్కూల్లో జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి అక్కారంపల్లి పోలింగ్‌ బూత్‌లో మున్సిపల్‌ కమిషనర్‌ అదితిసింగ్‌ ఓటు వేశారు. తిరుపతి టిడిపి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ మనవరాలు కీర్తితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి 50వ డివిజన్‌ తిమ్మినాయుడుపాలెంలో టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి భూమన అభినరురెడ్డి ఓటు వేశారు. తిరుపతి ఆర్‌పిఐ ఎంపి అభ్యర్థి పి.అంజయ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు. చంద్రగిరిలో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఓటు వేశారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్‌ తుమ్మలగుంటలో ఒంగోలు ఎంపి అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి ఎంఎల్‌ఎ అభ్యర్థి మోహిత్‌రెడ్డి ఓటేశారు. పాకాల మండలం పులితివారిపల్లిలో టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌ ఓటేశారు. పుత్తూరు ఎస్‌ఆర్‌ఎస్‌ జూనియర్‌ కళాశాలలో నగరి కాంగ్రెస్‌ అభ్యర్థి పోచారెడ్డి రాకేష్‌రెడ్డి ఓటేశారు. నారాయణవనం మండలం భీమన్నచెరువు పోలింగ్‌కేంద్రంలో టిడిపి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఓటేశారు. సూళ్లూరుపేట వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య తన కుటుంబంతోకలిసి కాదులూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా వి.కోట మండలం తోటకనుమలో వైసిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి వెంకటేగౌడ దంపతులు ఓటు వేశారు. పూతలపట్టు టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కలికిరి మురళీమోహన్‌ గొడుగుచింత గ్రామంలో ఓటు వేశారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణి మండలంలోని కెలవాతిలో అమరనాథరెడ్డి కుటుంబం ఓటేసింది. నగరిలో ఆర్‌కె రోజా కుటుంబ సమేతంగా ఓటేశారు. నియోజకవర్గం మొత్తం ఓట్లు పోలైన శాతంతిరుపతి జిల్లా 18,63,980 76.51 1.చంద్రగిరి 3,15,159 78.242. శ్రీకాళహస్తి 2,48,536 79.033. వెంకటగిరి 2,43,582 79.964. తిరుపతి 3,02,503 62.565. సూళ్లూరుపేట 2,42,610 80.126. గూడూరు 2,45,205 76.307. సత్యవేడు 2,15,385 82.94చిత్తూరు జిల్లా 16,40,202 75.781. కుప్పం 2,25,775 75.672. పలమనేరు 2,67,896 72.333. పూతలపట్టు 2,20,999 77.174. పుంగనూరు 2,38,868 74.095. చిత్తూరు 2,28,850 74.756. జీడీనెల్లూరు 2,04,949 79.907. నగరి 2,02,574 76.81

➡️