వైసిపి పాలనలో అన్ని వర్గాలకూ నష్టం

May 9,2024 21:12

 ప్రజాశక్తి- బొబ్బిలి : వైసిపి పాలనలో అన్ని వర్గాల ప్రజలకూ నష్టం జరిగిందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు, టిడిపి కూటమి అభ్యర్ది బేబినాయన అన్నారు. మండలంలోని పెంట, రంగరాయపురం, పక్కిలో బేబినాయన, ముత్తావలస, కమ్మవలస, రాముడువలస, గొంగాడ వలసలో మాజీమంత్రి సుజయ నాయన గురువారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచక పాలన చేయడంతో అన్ని వర్గాల ప్రజలకు నష్టం జరుగుతుందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు రాకపోవడంతో పారిశ్రామిక అభివృద్ధి కుంటు పడిందన్నారు. దీంతో నిరుద్యోగ సమస్య పెరిగి యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అరాచక పాలనకు ఓటుతో బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెంటు రాజా, జనసేన నాయకులు గిరడ అప్పలస్వామి, బాబు పాలూరి, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.వైసిపి పాలనకు చరమగీతంబాడంగి : వైసిపి పాలనకు చరమగీతం పాడాలని మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు కోరారు. గురువారం మండలంలో డి.వెంకయ్యపేట, ఆనవారం, మల్లంపేట, గూడెపువలస, తదితర గ్రామాల్లో టిడిపి అభ్యర్థి బేబినాయనకు మద్దతుగా ప్రచారం చేశారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు తెంటు రవిబాబు, నాయకులు పాల్గొన్నారు.

➡️