ఓపిఎస్ అమ‌లు చేసే వారికే యుటిఎఫ్ మ‌ద్ద‌తు

Nov 29,2023 14:43 #Kurnool
utf mandal council meet

ప్రజాశక్తి-ఆదోని : సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించిన వారికే రాబోయే ఎన్నికలలో సంపూర్ణ మద్దతు ఉంటుందని యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు బి జీవిత, జిల్లా కార్యదర్శి టీ గాదిలింగప్ప తెలిపారు. బుధవారం మున్సిపల్ హై స్కూల్‌లో ఆదోని రూరల్ మండల సమావేశం మండల అధ్యక్షులు వై రామాంజనేయులు అధ్యక్షతన నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో పాదయాత్రలో భాగంగా ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గాలికి వదిలేశార‌న్నారు. సిపిఎస్ అధికారంలో వ‌చ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానని మాట ఇచ్చి నాలుగేళ్లు కాలయాపన చేసి గ్యారంటీ పెన్షన్స్ స్కీమ్ విధానాన్ని తీసుకుని రావడం అన్యాయ‌మ‌న్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతున్నాయని విమర్శించారు. యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణకై పోరాడుతామని తెలియజేశారు. అనంతరం ఆదోని రూరల్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహాధ్యక్షులుగా ఎం రాముడు, జి కళ్యాణి, ఆర్థిక కార్యదర్శిగా జి నాగేంద్ర, కార్యదర్శులుగా ఊరుకుందయ్య, సిద్దప్ప, ఈరన్న, హనుమంతు, జనార్ధన్, శ్రీకాంతు, రంగనాయకులు, తేజ, వెంకటరమణ, రేణుక భాయి, భారతి, అరుణ జ్యోతి పాల్గొన్నారు. జిల్లా కౌన్సిల్ సభ్యులుగా హుసేని, వై రామాంజనేయులు, పాపయ్య,రుద్రముని, భోజరాజు, సిహెచ్ పెద్దయ్య, శివకుమార్ గౌడ్, నర్సయ్య గౌడ్, భాగ్యలక్ష్మి, అన్నపూర్ణ, జనార్ధన్, మహిళా విభాగం కన్వీనర్ సుజాత, అకాడమిక్ విభాగం కన్వీనర్ బి మల్లయ్య, సాంస్కృతిక విభాగం కన్వీనర్ ఆవుల బసప్ప, ఆడిట్ కన్వీనర్ వేణుగోపాల్, సిపిఎస్ కన్వీనర్ జి రామాంజనేయులు ఎన్నుకున్నారు.

➡️