వాడవాడలా మేడే సంబరాలు

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం రెపరెపలాడింది. పట్టణాలు, మండలాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులు ఎర్రజెండాలు చేతపట్టి ఎక్కడికక్కడ దండుగా కదిలారు. ప్రదర్శనలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ విధానాలపై నిప్పులు చెరిగారు. ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ కార్మిక వర్గం తమ హక్కుల సాధన కోసం ప్రతినభూని భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న మతోన్మాదుల ఉచ్చు నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అందుకు ఈ నెల 13 న జరుగుతున్న ఎన్నికలు నాంది కావాలని సిపియం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. కార్మికుల దినోత్సవం సందర్బంగా స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జెండా ఎగురవేసి అనంతరం ర్యాలీగా ఏర్పడి ప్రభుత్వా సుపత్రి వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. సిఐటి యు మండల ప్రధాన కార్యదర్శి డి.భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ వందల సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభు త్వం తుంగలో తొక్కి కేవలం నాలుగు లేబర్‌ కోడ్‌ లను తీసు కురావడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగానే మిత వాద శక్తులు, మతోన్మాదులు చెల రేగిపోవడంతో నిరు ద్యోగం, పేదరికం, దారిద్యంతాండవిస్తుందని అన్నారు. భారతదేశంలో గత పది సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తున్న మతోన్మాద పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలు కారు చౌకగా కార్పోరేట్‌ సంస్థలకు తాకట్టు పెట్టి ప్రజాస్వామ్య హక్కులు ఖూనీ చేయబడుతున్నాయని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో కోట్లాదిమంది పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అయినా ఉక్కు ఫ్యాక్టరీని తెగ నమ్మేందుకు లేదా నిర్ధాక్షణ్యంగా మూసివేసేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ఐసిడియస్‌, విద్యుత్‌, రెవెన్యూ, మున్సిపల్‌, బస్టాండ్‌లో ఆరు చోట్ల మే డే జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి డి. భాగ్యలక్ష్మి, సిఐటియు జిల్లా నాయకులు చెన్నయ్య, రాంబాబు, బంగారుపాప, ఖాజాభి, విజయమ్మ, నాగమణి, అరుణ, సుమలత, మాధవయ్య, రెడ్డెయ్య, యుటి యఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జబీర్‌, కెవిపియాస్‌ వెంకటయ్య, అంగన్వాడీ, ఆశా, మున్సిపల్‌ విద్యుత్‌, గ్రామ పంచాయతీ, గ్రీనంబాసిడర్స్‌, విఆర్‌ఎలు పాల్గొన్నారు. బి.కొత్తకోట : మేడేను పురస్కరించుకొని యంగ్‌ ఇండియా సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బెంగుళూరు నగర మహాదేవపుర బిబిఎంపిలో పనిచేస్తున్న 150 సిబ్బందికి దుప్పట్లు,దిండ్లు పంపిణి చేశారు.ఈ సందర్బంగా తగాది రాజశేఖర్‌ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం కార్మికులు చేస్తున్న సేవలు అమోఘమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ ఎన్‌.పిల్లప్ప, బిబిఎంపి కాంట్రాక్టర్‌ జనరల్‌ సెక్రటరీ బిన్‌ ప్రకాష్‌, సి.దేవరాజ్‌, ఎస్‌.మంజునాథ్‌, యంగ్‌ ఇండియా సేవా ఫౌండేషన్‌ అధ్యక్షులు రాజశేఖర్‌ పాల్గొన్నారు.రాజంపేట అర్బన్‌ : రాజంపేట టూ వీలర్‌ మెకానిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని ర్యాలీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహి ంచారు. టూ వీలర్‌ మెకానిక్‌ అసోసి యేషన్‌ జెండాలను బైక్‌లకు కట్టుకొని రాజంపేట, నందలూరు, పుల్లంపేట మండలాలకు చెందిన మెకానిక్‌లు భారీగా ఆర్‌ఎస్‌ రోడ్డు మీదుగా ఆర్‌డిఒ కార్యాలయం వరకు ఈ ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో రాజంపేట టూవీలర్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షులు కే.సుభాన్‌, అధ్యక్షులు కె.రామ్మోహన్‌, కార్యదర్శి ఎస్‌.అబ్దుల్‌ గపూర్‌, కోశాధికారి ఏ.హరినాథ్‌, సీనియర్‌ నాయకులు ఎస్‌.రఫీ, నెల్లూరు భాష, జిలాని, సుబ్బరాజు, నజీర్‌, నందలూరు మండలం నుంచి అలీ, బాషా, పుల్లంపేట మండలం నుంచి అజిద్‌వల్లి పాల్గొన్నారు .రాజంపేట అర్బన్‌ : సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్‌ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ, మున్సిపల్‌, ఎలక్ట్రిసిటీ, హమాలి, ఆటో యూనియన్‌లతో కలిపి ఏడు కేంద్రాలలో ఎర్రజెండా ఎగురువేసి కార్మికులు ఐకమత్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ ఓబయ్య, ప్రసాద్‌, విద్యుత్‌ కార్మికులు శ్రీహరి, సుధాకర్‌, అంగన్వాడి కార్యకర్తలు శ్రీలక్ష్మి, పాల్గొన్నారు.పీలేరు: కార్మికుల దినోత్స వాన్ని పురస్కరించుకుని స్థానిక పంచాయతీ మిట్టపై పంచాయతీ కార్మికులు, యుటిఎఫ్‌, ఉపాధ్యాయ సంఘ నాయకులు సంయుక్తంగా ఎర్ర జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పంచాయితీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరామయ్య, యుటిఎఫ్‌ మాజీ నాయకులు జి. రాధాకష్ణ, హమాలీలు పురుషోత్తం, నాగరాజ పాల్గొ న్నారు.ఆర్‌టిసి ఎస్‌డ బ్ల్యూఎఫ్‌ సంఘం ఆధ్వర్యం లోనూ ఎర్రజెండాను ఎగురవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్ర మంలో నాయకులు కేసిఎస్‌.రెడ్డి, బాబు, చంద్ర, సురేంద్ర పాల్గొన్నారు. రైల్వేకోడూరు: రైల్వే కోడూరులో ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో సిఐటియు జెండాను, సీనియర్‌ సిఐటియు కార్మిక నాయకులు సుబ్బరామయ్య జెండాను ఆవిష్కరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, పి.జాన్‌ ప్రసాద్‌, అంగన్వాడీ కార్మికులు, సహాయకులు, ప్రాజెక్టు కోశాధికారి, పద్మావతి, మండల నాయకులు, వెన్నెల, శిరీష, లీలావతి, జైకుమారి, సుజాత, హేమలత, ఉష, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌, జిల్లా నాయకులు కనపర్తి కిరణ్‌, రమేషు, విద్యుత్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, ఎం.సుబ్బరాయుడు, అంకయ్య, జోగినేని మనీ, రాజు, గ్రామ సేవకుల విఆర్‌ఎ సంఘం మండల కార్యదర్శి లక్ష్మీకర్‌, సుబ్రహ్మణ్యం, నాగరాజు, ఆని మేటర్‌ సంఘం, సిఐటియు మండల కార్యదర్శి, నగిరిపాటి, ఆనంద్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సంఘం నాయకులు,హరిప్రసాద్‌, మునిచంద్రరాజు, ఆటో యూని యన్‌ నాయకులు, చలపతి, కార్మికులకు అండగా నిలిచే వారికే మద్దతు సిఐటియు జిల్లా కార్యదర్శి బెల్లం మనోహర్‌జమ్మలమడుగు రూరల్‌ :కార్మికుల పక్షాన అండగా నిలిచే పార్టీలకే మద్దతు ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి బెల్లం మనోహర్‌ పిలుపునిచ్చారు. బుధవారం మేడే కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముందుగా మున్సిపల్‌ క్లస్టర్‌ పాయింట్‌ వద్ద, పాత బస్టాండ్‌ ఆటోస్టాండ్‌, తొలివేముల ఆటోస్టాండ్‌ వద్ద ఆయన సిఐటియు జెండాలను ఎగురవేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ఆవరణం నుంచి స్టేట్‌ బ్యాంక్‌ మీదుగా గాంధీ విగ్రహం వరకు ఆటో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం మే డే పురస్కరించుకొని బెల్లం మనోహర్‌ మాట్లాడారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి దాసరి విజరు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ పట్టణ అధ్యక్ష, కార్యదర్సులు నాగన్న, శేఖర్‌, కోశాధికారి శివ, చెన్నయ్య, బాలు, సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు వినరు, సిపిఎం పట్టణ కార్యదర్శి గోపాల్‌ దాస్‌ ఏసుదాసు, మే ఐ హెల్ప్‌ యు ఫౌండేషన్‌ చైర్మన్‌ మోరే లక్ష్మణ్‌ రావు, కమిటీ సభ్యులు, ఆటో యూనియన్‌ నాయకులు కుమార్‌, ఆటో, మున్సిపల్‌ వర్కర్స్‌ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మే డే స్ఫూర్తితో కార్మి కవర్గం ఐక్య పోరాటాలతో ముందుకు సాగాలని సిఐటియు నాయకులు గండి గురయ్య పిలుపునిచ్చారు. మఠం అయిదు రోడ్ల కూడలిలో సీనియర్‌ నాయకులు బోలా శ్రీరాములు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. పలుచోట్ల జండాలను మే డే సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గండి గుర్రయ్య, బుడ్డేనబోయిన హరి, గండి సునీల్‌కుమార్‌ మాట్లా డారు. కార్యక్రమంలో మేరీ, గుర్రయ్య, బిగ్‌బాస్‌, వీర నారా యణ, చక్రవర్తి, సిహెచ్‌ గుర్రయ్య, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు కలివేల రాజశేఖర్‌, ఉపాధ్యక్షులు రమేష్‌, అరవింద్‌, దేవకుమార్‌ పాల్గొన్నారు. వేంపల్లె :సమస్యల పరిష్కారారికి కార్మికులంతా ఐక్యంగా పోరాటం చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. బుధవారం మే డే సందర్భంగా స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో కార్మిక జెండాను ఆయన ఎగుర వేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త అధ్యక్షుడు ఓబులేసు, జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా బాలాజీ, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు దస్తగిరి పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్మికలు ఆధ్వర్యంలో.. కడప అర్బన్‌ : ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకుని నగర మున్సిపల్‌ కార్మిక సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ప్రధానంగా పాత మున్సిపల్‌ ఆఫీసు నగర కమిటీ అధ్యక్షులు రవి జిల్లా కమిటీ సభ్యులు కంచుపాటి తిరుపాల్‌, డ్రైవర్ల కమిటీ అధ్యక్షులు వడ్లపల్లి శ్రీధర్‌ బాబు, కార్యదర్శి సుంకర కిరణ్‌, నగర కమిటీ సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్‌, మహిళా కార్మికులు చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ పాత మున్సిపల్‌ ఆఫీస్‌ లో నిర్వహించారు. చిన్న చౌక్‌ లో ఆదామ్‌ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. చెమ్మో మియాపేట లో కంచుపాటి తిరుపాల్‌ కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ కావించారు. అలంకానపల్లె, నాగరాజు జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు, మహిళా కార్మికులు, లోడర్లు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కడప : జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు చెప్పలి పుల్లయ్య అధ్యక్షతన బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు చేయడం జరిగింది. కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు వై.విష్ణు ప్రితమ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు మధు రెడ్డి, కార్మిక నాయకులు హబీబుల్లా, అశోక్‌ రావు, యశ్వంతు, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు బాబు, హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా అధ్యక్షుడు పాలగిరి శివ, మహిళా నాయకులు శ్యామలాదేవి, లావణ్య, నాగరత్న, రమాదేవి, లక్ష్మీదేవి, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. ప్రకతినగర్‌లో.. సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌. బాబా ఫక్రుద్దీ ఆదేశాల మేరకు బుధవారం లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులచే కడప నగరంలోని ప్రకతి నగర్‌లో వీడే దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ న్యాయవాదులు మేడే ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కడప డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, కార్మికులు పాల్గొన్నారు. కలసపాడులో.. సిఐటియు ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. మొదట సిఐటియు కలసపాడు మండల మహిళా నాయకులు ఓబులాపురం విజయమ్మ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్‌ కుమార్‌, అవాజ్‌ కమిటీ సభ్యు హుస్సేన్‌ పీరా, మండల హరితరాయిబారుల కమిటీ సభ్యులు వెంకటేష్‌, హైదరవల్లి, క్రాఫ్ట్‌ టీచర్ల యూనియన్‌ నాయకుడు గని, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు : తమ హక్కుల సాధన కోసం ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాసులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డి వై ఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షులు చిన్ని, మున్సిపల్‌ నాయకులు శివకుమార్‌, హరి, శ్యామ్‌, జెఇసిడబ్ల్యుయు నాయకులు పిసి కొండయ్య ,హుస్సేన్‌, రఫీ అంగన్వాడీ నాయకురాలు సుభాషిణి హుసేనమ్మా, విజయమ్మ సుజాత హమాలీ నాయకులు ఒబయ్య, జయరాములు,తిరుపతయ్య, బిల్డింగ్‌ నాయకులు రాజగోపాల్‌ బాలస్వామి సిఐటియు నాయకులు నాగార్జున అంజి, బొడ్డురవి శ్రామిక వ సుందరయ్య, జ్యోతిబసు నగర్‌, ఐలమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు. గోపవరం : బద్వేల్‌ నియోజకవర్గంలోని సి. కొత్తపల్లిలో మే డే కార్మిక దినోత్సవ వేడుకలు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డి. వెంకటేష్‌ జెండాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రమణ, సుబ్బయ్య, దుర్గమ్మ, కుమార్‌, కార్మికులు పాల్గొన్నారు, పుల్లంపేట : మే డే పురస్కరించుకొని బుధవారం నాడు సిఐటియు నాయకులు శ్రీ లక్ష్మీ ఆధ్వర్యంలో పుల్లంపేట మెయిన్‌ రోడ్డులో సిఐటియు జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షురాలు వనజ కుమారి, కళావతి, రాధా, చెంచులక్ష్మి , నాగ లత, రోజా, విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌ సిబ్బంది పాల్గొన్నారు.విద్యుత్‌ కార్యాలయంలో : విద్యుత్‌ డివిజన్‌ కార్యాలయం లో 138 మే డేసందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ వై.చంద్రశేఖర్‌రెడ్డి, యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎ.వి.రమణ, డిస్కమ్‌ అధ్యక్షులు సుబ్రహ్మణ్యంరాజు, డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు నగేష్‌గౌడ్‌, శ్రీనివాసులురెడ్డి, రెడ్డప్ప, యూనియన్‌ నాయకులు కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. చిట్వేలి : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో మ్యాక్సీ స్టాండ్‌ దగ్గర బస్టాండ్‌, ఆటో స్టాండ్‌లో అధ్యక్ష కార్యదర్శులు నాని, సుజాత సిఐటియు జెండాను ఆవిష్కరించారు. చిట్వేలి ఉప సర్పంచ్‌ ఉమామహేశ్వరరెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పందికాళ్ళ మణి, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ ఓబిలి పెంచ లయ్య, గ్రామ సేవకుల సంఘం డివిజన్‌ అధ్యక్షులు కొర ముట్ల సుధాకర్‌, మ్యాక్సీ స్టాండ్‌ అధ్యక్ష కార్యదర్శులు జిలకర సిద్ధూ, బత్తినేని మల్లికార్జున, చిన్న,మనోహర్‌, సాదక్‌, రమణ, దుర్గయ్య, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ మహిళా నాయ కులు, పగడాల సుధామణి పాల్గొన్నారు.మైదుకూరు : మే డేను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (యుటిఎఫ్‌) ఆధ్వర్యంలో మైదుకూరు ఉన్నత పాఠశాలల సముదాయం ముందు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా సహ అధ్యక్షులు వై.రవికుమార్‌, మండల నాయకులు వనమాల రాము, గంగులయ్య, రామ్‌ నాయక్‌, తిరుపాలయ్య, ఖాదర్‌ మోహిద్దీన్‌ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : మే డే కార్మికలోకానికి పండుగ లాంటిదని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. మే డే సందర్భంగా బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి విజయకుమార్‌, అంగన్వాడీ యూనియన్‌ కార్యదర్శి సుబ్బలకిë, సునీత పాల్గొన్నారు. పులివెందుల టౌన్‌ : పట్టణ పరిధిలో మే డే వేడుకలను సిఐటియు డివిజనల్‌ కార్యదర్శి గపూర్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డ్రైవింగ్‌ స్కూల్‌లో సిఐటియు జెండా ఎగర వేసి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సుధ, పద్మ, కళావతి, రామం జనమ్మ, కిర ణ్మయి, రిబికా, శాంతి, స్వరూప, సుజాత, శివమ్మ, పద్మావతి పాల్గొన్నారు. ఎర్రగుంట్ల : మే డే సందర్భంగా ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని నాలుగు రోడ్ల కూడలిలో ఉత్స వాలు ఘనంగా నిర్వహించారు. సిఐటియు ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌, అంగన్వాడీ ప్రాజెక్టు నాయ కులు కుసుమ కుమారి, ఉమాదేవి, లక్ష్మీకళ, వనవతి, సుబ్బ లక్ష్మమ్మ, లవకుమారి, శివలీల, ఆయాలు పాల్గొన్నారు.

➡️