ఎపిఆర్‌ఎస్‌లో వీనస్‌ విద్యార్థుల ప్రతిభ

వీనస్‌ విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించిన పెదపూడి త్రిపుర

ప్రజాశక్తి – మాడుగుల: ఇటీవల విడుదలైన ఎపిఆర్‌ఎస్‌, ఎపిఆర్‌జెసి ఫలితాలలో మాడుగుల విద్యార్థిని పెదపూడి త్రిపుర రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించి సత్తా చాటింది. మాడుగులకు చెందిన వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులు ఎపిఆర్‌ఎస్‌, ఎపిఆర్‌జెసి రెండు ఫలితాల్లోనూ రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారని ఇనిస్టిట్యూట్‌ కరస్పాండెంట్‌ తాళపు రెడ్డి నాగచంద్ర తెలిపారు. వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌లో తర్ఫీదు పొందిన పెదపూడి త్రిపుర ఎపిఆర్‌ఎస్‌ రాష్ట్రస్థాయి 6వ ర్యాంక్‌ సాధించగా, వేపాడ పూర్ణచంద్రరావు ఎపిఆర్‌జెసిలో రాష్ట్రస్థాయిలో 16వ ర్యాంక్‌, ఏడాకుల పావని 51వ ర్యాంకు, కటకం జయంత్‌ 184వ ర్యాంకు, దాసరి రామ్‌చరణ్‌ 342వ ర్యాంకు, తామరపల్లి హేమన్య 67వ ర్యాంకు, చింతపల్లి హైమావతి 1043వ ర్యాంకులను వరుసగా సంపాదించారని కరస్పాండెంట్‌ చంద్ర తెలిపారు. మీరంతా ఈనెల 20వ తేదీన గుంటూరులో జరగబోవు కౌన్సిలింగ్‌లో పాల్గొంటారని తాళపురెడ్డి నాగచందర్‌ తెలిపారు. మారుమూల గ్రామాలకు చెందిన తమ పిల్లలకు ప్రవేశపరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంకుల సాధించేలా శిక్షణనిస్తున్న వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌ కరస్పాండెంట్‌ తాళ్లపురెడ్డి నాగచంద్రకు విద్యార్థులు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు దంగేటి సూర్యరావు, శ్రీనాధు శ్రీనివాసరావు, సర్పంచ్‌ ఎడ్ల కళావతి, భారత నిర్మాణ సేన గౌరీపట్టపు మహేష్‌ కుమార్‌, తల్లిదండ్రులు ఇనిస్టిట్యూట్‌ యాజమాన్యానికి మరియు పిల్లలకూ అభినందనలు తెలిపారు.

ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తున్న గ్రామ పెద్దలు

➡️