ఎస్‌ఎస్‌ఒఎస్‌ఇఎఫ్‌ జిల్లా కమిటీ ఎన్నిక

Jan 22,2024 21:03

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ – జెఎసి సమావేశం ప్రజా సంఘాల కార్యాలయంలో ఆర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం జరిగింది. జెఎసి జిల్లా సమావేశానికి పర్యవేక్షకులుగా రాష్ట్ర అధ్యక్షులు బి. కాంతారావు (నాని) జిల్లా గౌరవ అద్యక్షులు జి అప్పలసూరి హాజరయ్యారు. 22 రోజుల సమ్మె, అనుభవాలు, లోపాలు, భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మన ఐక్యతను కొనసాగిస్తూ రాష్ట్ర జెఎసి నాయకత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఐక్యతను మరోసారి చాటి చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చర్యలు తీసుకోవాలని, జీతాలు పెంపు జీవో విడుదల చేయాలని కోరుతూ తీర్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా కె.గురువులు, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బి.రవీంద్రబాబు, ఉపాధ్యక్షులుగా పి.తేజేశ్వరి, ఎన్‌.పద్మ, పి.రాంబాబు, డి.జయగణేశ్‌, ప్రధాన కార్యదర్శిగా రమాదేవి , అడిషనల్‌ జనరల్‌ సెక్రటరీగా ఆర్‌ శ్రీనివాసరావు, జాయింట్‌ కార్యదర్శులుగా డి. నరసింహం, బి.నారాయణమూర్తి, టి.చిన్నతల్లి, వంశీకృష్ణ, ఎం.రాజు, కోశాధికారి (ట్రెజరర్‌)గా వి.సింహాచలం ఎన్నికయ్యారు.

➡️