ఘనంగా ఒలింపిక్‌ డే

Jun 23,2024 21:27

ప్రజాశక్తి- శృంగవరపుకోట : అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవం సందర్భంగా స్థానిక భవాని నగర్‌లో గల డాక్టర్‌ వరలక్ష్మీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయుడు గొర్లె రాము, ప్రిన్సిపల్‌ వై జానకి దేవి ఆధ్వర్యంలో ఆ స్కూల్‌ నుంచి జవహర్‌ నవోదయ విద్యాలయం వరకు 5 కిలోమీటర్ల పరుగు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యా యులు వై.జానికి దేవి మాట్లాడుతూ శారీరక వ్యాయామం విద్యార్థులకు ఏకాగ్రత, పఠణా శక్తి, శారీరక ధృఢత్వం కలుగుతుందని, క్రమశిక్షణతో కూడిన నడవడిక అలవడుతుందని అన్నారు

➡️