ఘనంగా స్వామి వివేకానంద జయంతి

Jan 12,2024 21:55

వీరఘట్టం:మండలంలోని స్వామి వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టపూడివలస గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు సాకేటి రాంబాబు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఎన్‌ శివ, విద్యార్థులు పాల్గొన్నారు.వృద్ధులకు, పేద మహిళలకు రగ్గులు పంపిణీ పార్వతీపురం టౌన్‌ : స్థానిక పట్టణ పోలీస్‌ స్టేషన్లో హెడ్‌కానిస్టేబుల్‌గా వృద్దమిత్ర కో-ఆర్డినేటర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణమూర్తి ప్రతి నెల వలే ఈ నెలలోనూ తమ సొంత నిధులతో శుక్రవారం స్వామి వివేకానంద జన్మ దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అడ్డాపుశిల పంచాయతీ పరిధిలో గల గదబవలసలోని 40 మంది పేద మహిళలకు, వృద్ధులకు రగ్గులు, స్టీల్‌ గ్లాసులు ఆ గ్రామ పెద్దలైన గొర్లి సింహాచలం, గుమ్మడి నారాయణ, కశయ్య, నాగేశ్వరావు, పారా లీగల్‌ వాలంటీర్‌ వి.శ్రీనివాసరావు రాజు సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, పోలీస్‌ శాఖలో కృష్ణమూర్తి లాంటి వ్యక్తి ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. ఆయన్ను ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆదర్శంగా తీసుకొని ఇతరులకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. పార్వతీపురం రూరల్‌ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పార్వతీపురంలోని పలుచోట్ల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణం శివారు రాయగడ రోడ్డులోని జట్టు ఆశ్రమం, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యోజన ఉత్సవాలను ఆశ్రమ నిర్వాహకులు వి.పద్మజ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాల శుభ్రతపై వ్యక్తిత్వ వ్యాసరచన, చిత్రలేఖన, వంటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే బైపాస్‌ రోడ్డులో ఉన్న టిడిపి కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని వివేకానంద స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాయగడ రోడ్డు వివేకానంద కాలనీలో స్థానిక యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వివేకానందుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గరుగుబిల్లి : మండలంలోని రావివలస, నాగూరులో జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద 161వ జయంతోత్సవాలు జరిగాయి. రావివలసలో అరకు పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు కోట భరత్‌ (సుమన్‌), మండలం టిడిపి అధ్యక్షులు అక్కేన మధుసూద నరావు నాగూరు హైస్కూల్‌ ఆవరణంలో స్వామి వివేకానంద విగ్రహనికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని మన దేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతంగా తయారవ్వడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో గుంట్రెడ్డి వెంకట్‌ నాయుడు, గంట ముసలి నాయుడు, గొర్లి కిషోర్‌, దామోదర్‌ నాయుడు, కర్రి సంతోష్‌, శ్రీనివాసరావు ఫ్రెండ్స్‌ యూత్‌ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు.కురుపాం : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఉత్తమ మార్గంలో నడిచి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌ఐ వి.షణ్ముఖరావు అన్నారు. శుక్రవారం మండలంలోని బియ్యాలవలస పంచాయతీ దురిబిలి గిరిజన గ్రామంలో ఎస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని అన్నారు. అనంతరం యువతకు వాలీబాల్‌ కిట్లు, వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్టేట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ ,స్థానిక సర్పంచ్‌ పి. అజ్జారి,యస్‌ సొసైటీ కార్యదర్శి షేక్‌ గౌస్‌, బియ్యాలవలస, గొటివాడ యువత ఎస్‌ సొసైటీ సభ్యులు లక్ష్మి, మాజీ సర్పంచ్‌ పువ్వుల పత్తి పాల్గొన్నారు.సీతంపేట :మండలంలో రామగిరి క్షేత్రం సమీపంలో ఉన్న భారతి ఇంటర్నేషనల్‌ స్కూల్లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ ఎస్పీ పెంటయ్య స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు .కార్యక్రమంలో ఉపాధ్యాయులు మురళీమోహన్‌ దివాకర్‌ సురేష్‌ పార్వతి మురళి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

➡️