నేడు నియోజకవర్గ స్థాయి ‘ఆడుదాం ఆంధ్ర’

Jan 23,2024 18:00

ప్రజాశక్తి-బొబ్బిలి : స్థానిక గురుకుల పాఠశాల మైదానంలో బుధవారం ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్‌డిఒ ఎ.సాయిశ్రీ చెప్పారు. గురుకుల పాఠశాల మైదానాన్ని మంగళవారం ఎంపిడిఒ పి.రవికుమార్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులతో నియోజకవర్గ స్థాయి ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ స్థాయి విజేతలు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. క్రీడా ప్రాంగణంలో తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు.

➡️