పిటిసికి డిజిపి కమాండేషన్‌ డిస్క్‌

Mar 1,2024 20:29

ప్రజాశక్తి-విజయనగరం కోట : విజయనగరంలోని పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు బిపిఆర్‌అండ్‌డి ప్రదానం చేసే కమాండేషన్‌ డిస్క్‌ లభించింది. ఈమేరకు గురువారం ఢిల్లీలో పిటిసి ప్రిన్సిపాల్‌ టి.ఆనంద్‌బాబుకు బిపిఆర్‌అండ్‌డి డిజిపి బాలాజీ శ్రీవాత్సవ్‌ ఈ డిస్క్‌ను అందజేశారు. దేశంలోని పోలీసు అకాడమీలు, శిక్షణ కళాశాలలను బిపిఆర్‌డి కమిటీ ఏటా సందర్శించి ఉత్తమ కళాశాలలను ఎంపిక చేస్తుంది. అందులో భాగంగా జిల్లాలోని కళాశాల 2021-22 సంవత్సరానికి గాను ఉత్తమంగా ఎంపికైంది. ఈనేపథ్యంలో ప్రిన్సిపాల్‌కు డిస్క్‌ను ప్రదానం చేశారు.

➡️