వైఎస్‌ ఆశయాలు జగన్‌తోనే సాధ్యం

Mar 3,2024 20:56

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సిఎం జగన్మోహన్‌ రెడ్డి నెరవేరుస్తున్నారని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఆదివారం ద్వారపూడి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామ స్వరాజ్యానికి సిఎం జగన్‌ శ్రీకారం చుట్టారని తెలిపారు. అవినీతి రహితంగా పథకాలు అందేలా చూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో డోల మన్మథకుమార్‌, వైసిపి మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి కెల్ల శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు కెల్ల త్రినాథరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ నడిపేన శశి భార్గవి, బొద్దుల మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.పొట్టి శ్రీరాములు, స్వామి వివేకానంద విగ్రహాలు ఆవిష్కరణ ఉడా కాలనీలో ఆర్యవైశ్య సేవాసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్వామి వివేకానంద, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలను డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు ముమ్మిడిశెట్టి సత్యనారాయణ, కార్యదర్శి డిమ్స్‌ రాజు, కోశాధికారి త్రినాథ్‌, అమరజీవి ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలవెళ్లి శేఖర్‌, కార్యదర్శి సముద్రాల నాగరాజు, కార్పొరేటర్‌ నారాయణప్పడు, డి.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.

➡️