నూతన రాజకీయ సాంప్రదాయం

Mar 21,2024 11:21 #Vizianagaram

ప్రజాశక్తి-రాజాం : నూతన రాజకీయ సాంప్రదాయం కోసం సిపిఎం విరాళాల సేకరణ చేస్తుందని సిపిఎం విజయనగరం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో రాజా నియోజకవర్గంలోని ఉణుకూరు, పోరాం తదితర గ్రామాల్లో విరాళాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బూర్జవ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు డబ్బులు పంచుతుంటే సిపిఎం  దానికి భిన్నంగా ప్రజా పోరాటాలకు అవసరమయ్యే నిధులను ప్రజల వద్ద నుంచి సేకరిస్తుందని అన్నారు. దీని ద్వారా ప్రజలకు ఒక నూతన సందేశాన్ని ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి శంకర్రావు, పార్టీ నాయకులు వి తిరుపతి, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

➡️