టిడిపి అభ్యర్థి ఇంటింటి ప్రచారం

Apr 15,2024 22:07

గజపతినగరం: పురిటి పెంట గ్రామంలోని న్యూకాలనీ, మారుతీనగర్‌ కాలనీలో టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి, జనసేన ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రం అభివద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. ప్రస్తుత ఈ అసమర్ధ వైకాపా ప్రభుత్వం సంపద సష్టించలేకపోయిందని, ఈ ఐదేళ్లు అరాచకం, విధ్వంసం చేయడం పాలనగా సాగించిందని అన్నారు. సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపిగా కలిశెట్టి అప్పలనాయుడును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు అట్టాడ లక్ష్మునాయుడు, జెడ్‌పిటిసి మాజీ సభ్యులు మక్కువ శ్రీధర్‌, మాజీ ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, వివి ప్రదీప్‌కుమార్‌, పివి గోపాలరాజు, గొర్లె బంగారునాయుడు, మంత్రి త్రినాధరావు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️