నిప్పులు చెరిగిన డీఎస్సీ అభ్యర్దులు

Feb 7,2024 17:21 #Vizianagaram
dyfi protest for mega dsc vzm

డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు ఉద్యమం
డీ వై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్దులు డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో కథం తొక్కారు. బుధవారం స్థానిక కోట జంక్షన్ నుంచి ఎమ్మార్ కాలేజీ మీదుగా పెద్ద చెరువు, ఎన్ సి ఎస్, బాలాజీ మార్కెట్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైటాయించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డి వై ఎఫ్ ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఐదేళ్లలో ఒక్క ఉపాద్యాయ పోస్టు లు భర్తీ చేయకుండా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది యువతను అన్యాయానికి గురి చేసిందన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఐదేళ్ల ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయకుండా నేడు కేవలం 6100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా ఉపాద్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఐదేళ్లకు కలిపి 6100 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం సరికాదన్నారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మరో వైపు విద్యా రంగాన్ని ఎన్ ఈ పి నీ రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ స్కూళ్లను విలీనం పేరుతో స్కూళ్లు మూసేసి ఉపాద్యాయ పోస్టులు భర్తీ కాకుండా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రకటన చెయ్యాలనీ డిమాండ్ చేశారు. అదే విధంగా ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎజెండాలో చేర్చి అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు కూడగట్టే మెగా డీఎస్సీ కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నీ కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో డి వై ఎఫ్ ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, జిల్లా అధ్యక్షులు హరీష్, ఎస్ ఎఫ్ ఐ నాయకులు రాము, రామ్మోహన్ డి వై ఎఫ్ ఐ, ఎస్ ఎఫ్ ఐ నాయకులు డీఎస్సీ అభ్యర్దులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️