ఆరోగ్యం మనందరి బాధ్యత

Apr 7,2024 21:28

ప్రజాశక్తి-విజయనగరం కోట : ఆరోగ్యం మన అందరి బాధ్యతని డిఎంహెచ్‌ఒ ఎస్‌.భాస్కరరావు తెలిపారు. ఆదివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ర్యాలీని ఆయన జెండా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి కె.రాణి, డిఐఒ అజరు కుమార్‌, వి.చిన్నతల్లి, బి.మహాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ప్రజారోగ్య పరిరక్షణకు కృషిచేయాలి
విజయనగరం టౌన్‌ : ప్రజారోగ్య పరిరక్షణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఇప్పటికైనా నిధులు వెచ్చించి ప్రభుత్వ వైద్యాన్ని అభివృద్ధి చేయాలని ఎపిఎంఎస్‌ఆర్‌యు జిల్లా కార్యదర్శి భగవాన్‌, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం.శ్రీనివాసా, జెవివి సమతా విభాగం రాష్ట్ర కన్వీనర్‌ నిర్మలా, ప్రజారోగ్య పరిరక్షణ వేదిక నాయకులు లక్ష్మణరావు డిమాండ్‌చేశారు. ప్రపంచ ప్రజారోగ్య దినం సందర్భంగా ఆదివారం కోట వద్ద నిరసన, ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో ఎపిఎంఎస్‌ఆర్‌యు నాయకులు మూర్తి, శశిధర్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️