మౌలిక సదుపాయాలకు నోచుకోని ఎల్బిజి నగర్

Mar 17,2024 12:10 #Vizianagaram

మురికి నీటి మద్య నివాసాలు
రోడ్లు, కాలువలకు నోచుకోని నగర్ వాసులు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరాభివృద్ధి మా లక్ష్యం, సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం అని గత అనేక ఏళ్లుగా ఎన్నికల సమయంలో నాయకులు చెప్పే మాటలు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటలు అమలకు నోచుకోవడం లేదు.ఇది ప్రతి సాధారణ ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు నుంచి వాగ్ధానాలు. ఎన్నికలు అయిన తర్వాత ఒడ్డు దాటాక తెప్ప తెలేసిన చందంగా రాజకీయ నాయకులు మాయలు నీటి మీద రాతలు లాగే మిగిలిపోతున్నాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఎల్ బి జి నగర్ లో దుస్తితి అందుకు నిదర్సనం.ఎల్ బి జి కాలనీ ఏర్పడి 18 ఏళ్లు అయ్యింది. అనేక దఫాలుగా పోరాడి,జైల్ కి వెళ్లి వీరోచిత పోరాటం ఫలితంగా విద్యుత్, ఒక బోరు, ఇంటి పన్నులు వేయించుకున్నారు. 18 ఏళ్లుగా నివాసం ఉంటున్న 50 కుటుంబాలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని కోరుతున్నా అనేక ప్రభుత్వాలు, పాలకులు వచ్చారు తప్ప శాశ్వతమైన పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. నాలుగు వీదులుగా ఉన్న నగర్ లో నేటికీ రోడ్లు లేవు, వాడుక నీరు వెళ్లేందుకు కనీసం కాలువకు కూడా లేవు.దీంతో ఇళ్ళ చుట్టూ మురికి నీరు నిలవ ఉండి,అదే ప్రాంతంలో జీవించల్సిన పరిస్తితి. తాగునీరు కు నోచుకోని పరిస్తితి. గత కొన్నేళ్లుగా తాటిపూడి నుంచి విజయనగరం వచ్చే తాగునీరు పైప్ లు లీకేజీ నీటి పై ఆధారపడి ఉన్నారు.తర్వాత సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రస్తుత ఎమ్మెల్యే ఒక బోరు వేయించడం జరిగింది. రోజూ తప్పించి రోజు వచ్చే మున్సిపల్ వాటర్ టాంక్ నీరు నాలుగు బిందెలు రెండు రోజులు సరిపెట్టుకుంటున్నారు. వాడుకలకు బిరు నీరు ఆధారం. ఆ నీరు నీటి కోసం. క్యూ లో ఉండి తెచ్చుకోవాల్సిన పరిస్తితి. అందరూ పేదలు కావడం వలన పాలకులు వారి సమస్యలు పరిష్కారం చేయడంలోనూ,వారికి మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. పిల్లలు చదువులకు నరవ,కలెక్టరేట్ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదవాల్సిన పరిస్తితి. 18 ఏళ్లుగా అధికారంలోకి వచ్చిన అధికార పార్టీ నాయకులు చుట్టూ తిరుగుతూ,అనేక పోరాటాలు నిర్వహించిన నేటికీ పట్టాలకు, రోడ్లు,కాలువలు వంటి సమస్యలు పరిష్కారం చేయడంలో అలసత్వం కొనసాగుతూనే ఉంది. ఎన్నికల సమయంలో ఓట్లు కోసం వచ్చే నాయకులకు మా కాలనీ సమస్యలు పరిష్కారం చేయాలని నగర్ వాసులు కోరుతున్నారు.

ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఆదుకోండి : గోడ్డి పుణ్యవతి

18 ఏళ్ళుగా ఇక్కడే జీవిస్తున్నాం.పిల్లలని కన్నాం,వాళ్ళు పెద్దవారు అయ్యారు కానీ మాకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడంలో నాయకులు,అధికారులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారన్నారు. మాకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి మాకు ఎవరు న్యాయం చేస్తే వారికి అండగా ఉంటామని,ఇళ్ళ పట్టాలు ఇచ్చి మమల్ని ఆదుకోవాలని ఆమె కోరారు.

రోడ్లు, కాలువలు వేసి మురుకి కూపం నుంచి కాపాడండి : కుప్పిలి.కుమారి 

18 ఏళ్లుగా అనేక విషషర్పాలు మద్య జీవనం సాగిస్తూ వస్తున్నామన్నారు. రోడ్లు లేవు,కాలువలు లేవు దీంతో ఇళ్ళ చుట్టూ మురికి నీరు చేరి అనేక వ్యాధులకు గురువుతున్నమన్నరు. పాలకులు ఎన్నికల సమయంలో వచ్చి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు.మాకు మౌలిక వసతులు రోడ్లు,కాలువలు,నీటి ఇబ్బందులు నుంచి కాపాడాలని ఆమె కోరారు.

➡️