విధుల్లో అలసత్వం వద్దు : ఎస్‌పి

May 11,2024 21:45

గజపతినగరం, బొబ్బిలి : ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని పోలీసు సిబ్బందికి ఎస్‌పి ఎం.దీపిక సూచించారు. గజపతినగరం, బొబ్బిలి నియోజకవరబొబ్బిలి అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో ఎటువంటి అలసత్వం వద్దని, పార్టీలకు అతీతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. 100 మీటర్ల పరిధిలో ఓటర్లు మినహా ఇంకెవ్వరూ ఉండకుండా చూడాలని, 200 మీటర్లు దూరంలోనే ఓటర్ల వాహనాలను నిలిపి వేయాలని, ప్రశాంతయితంగా ఎన్నికల నిర్వహణకు పని చేయాలని సూచించారు. ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే సంబధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. బొబ్బిలి డిఎస్‌పి పి.శ్రీనివాసరావు , పిటిసి డిఎస్‌పి వివి అప్పారావు, బొబ్బిలి సిఐ ఎం.నాగేశ్వరరావు, గజపతినగరం సిఐ ఎస్‌వి ప్రభాకరరావు, పలువురు ఎస్‌ఐలు, సిబంది పాల్గొన్నారు.

➡️