రోడ్లు విస్తరణ పూర్తి ఎప్పుడు..?

Mar 23,2024 12:05 #Vizianagaram

ప్రజాశక్తి-బొబ్బిలి : రానున్న ఎన్నికల్లో గెలిస్తే రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చే దమ్ము ఉందా అని ప్రధాన పార్టీలను లోక్ సత్తా జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ ప్రశ్నించారు. బజారు, పూల్ బాగ్ రోడ్లును శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు మారిన మున్సిపాలిటీలో రోడ్లు అభివృద్ధి చెందడం లేదన్నారు. తాము గెలిస్తే పట్టణంలోని బజారు రోడ్డు, పూల్ బాగ్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లు విస్తరణ, నియోజకవర్గ అభివృద్ధిపై హామీ ఇచ్చిన వారికే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనతో సమాచార హక్కు చట్టం సభ్యులు సురేష్ ఉన్నారు.

➡️