టిడిపితోనే గ్రామాల అభివృద్ధి : మాగుంట

ప్రజాశక్తి-శింగరాయకొండ : టిడిపితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి. టిడిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రోడ్‌ షో నిర్వహించారు. రోడ్‌ షోలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి దామచర్ల సత్య పాల్గొన్నారు. స్థానిక సాయి శ్రీనివాస కల్యాణ మండం వద్ద నుంచి పాకల రోడ్డు, ఆర్‌టిసి బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ రోడ్డు మీదుగా కందుకూరు రోడ్డు వరకూ రోడ్‌షో సాగింది. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మాగుంట సుబ్బరామిరెడ్డి ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మించి అనేక మందికి ఉపాధి కల్పించారన్నారు. డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని దాన్ని అంతం చేసేందుకు ప్రతి టిడిపి కార్యకర్త పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సింగయ్య, చీమకుర్తి కష్ణ, మించల బ్రహ్మయ్య, సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, నేలపాటి బాల శంకర్‌, ముళ్ళపూడి సత్యనారాయణ, కనిగిరి వెంకటేశ్వర్లు వేల్పుల వెంకటరావు, కూనపు రెడ్డి వెంకట సుబ్బారావు, ఇమ్మడిశెట్టి రామారావు, సుదర్శి చంటి, గొల్లమూడి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దొడ్డ మహీధర్‌రెడ్డి టిడిపిలో చేరిక మూలగుంటపాడు పంచాయతీ వార్డు మెంబర్‌, వైసిపి యువనాయకుడు దొడ్డ మహీధర్‌రెడ్డి టిడిపిలో చేరారు. టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి దామచర్ల సత్య ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరాడు. దామచర్ల సత్య మహీధర్‌రెడ్డి రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా శింగరాయకొండ సుందనగర్‌ చెందిన వైసిపి మహిళా నాయకురాలు ఇండ్ల సుజాత టిడిపిలో చేరారు. టంగుటూరు : తమ కుటుంబం పట్ల ప్రజలు చూపుతునన అభిమానానికి మాగుంట కుటుంబం ఎల్లప్పుడూ కతజ్ఞతగా ఉంటుందని టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలిపారు. టంగుటూరులో మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు స్వగహంలో కొండపి నియోజకవర్గ టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ తమ లాంటి నాయకులు అటు, ఇటు పార్టీలు మారారే తప్ప.. కార్యకర్తలు ఎవరూ మారలేదని తెలిపారు. టిడిపి కొండపి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ జగన్‌ రెడ్డి ఐదేళ్ల పాలనలో రాష్ట్రాభివద్ధిని పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లు ప్రతీకారాలు, విద్వేషాలు, టిడిపి నాయకులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు వారి వ్యాపారాలను జగన్‌ రెడ్డి టార్గెట్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నియోజకవర్గ నాయకులందరూ ఐకమత్యంతో పనిచేసి ఒంగోలు పార్లమెంటు స్థానానికి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌ కుమార్‌, మాగుంట నిఖిల్‌ రెడ్డి, ఎస్‌సి సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ధర్నాసి బ్రహ్మానందం, టిడిపి పట్టణ అధ్యక్షుడు కామని నాగశ్రీను, మహిళా నాయకులు రాయపాటి సీతమ్మ, రామారావు సోదరులు పోతుల నరసింహారావు, రాజేంద్రప్రసాద్‌, కొమ్మినేని వెంకట్రావు, కసుకుర్తి శ్రీధర్‌, చిడిపోతు వెంకటేశ్వర్లు, వెంకట్రావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.టిడిపిలో చేరిక మండల పరిధిలోని కాకుటూరువారిపాలెం సర్పంచి ప్రతినిధి కొమ్మినేని వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామ మాజీ ఉపసర్పంచి గుడిపూడి రవీంద్రబాబు, మాజీ ఎంపీటీసీ పైడి సింగమ్మ, మన్నం రాము, రవీంద్రబాబు తదితరులు టిడిపిలో చేరారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కొండపి ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా కొండపి నియోజకవర్గ పరిధిలోని దావగూడూరు గ్రామానికి చెందిన పలువురు ఎంపీ మాగుంట సమక్షంలో టిడిపిలో చేరారు.

➡️