ప్రలోభాలకు లోనవ్వకుండా ఓటేయండి

Apr 22,2024 00:49

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని వెల్దుర్తి మండలం కుంకుడు చెట్టు పెంట తండాలో గిరిజనులకు పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ సూచించారు. మాచర్ల నియోజకవర్గంలోని ఈ తండాలో ఆదివారం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జెసి శ్యామ్‌ప్రసాద్‌తో కలిసి పర్యటించిన కలెక్టర్‌ మాట్లాడుతూ అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అనంతరం మరసపెంట చెక్‌ పోస్టును తనిఖీ చేశారు. మండలంలోని గొట్టిపాళ్లలో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలైను సందర్శించి అక్కడ సదుపాయాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఓటు హక్కు వినియోగంపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం మందాడ జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో రాత్రి బస చేశారు.

➡️