పాడి పరిశ్రమను ఆదుకుంటాం

ప్రజాశక్తి-దర్శి : టిడిపి అధికారంలోకి వస్తే పాడి పరిశ్రమను ఆదు కుంటామని టిడిపి కూటమి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని చెరువు కొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరాయపాలెం, బొట్లపాలెం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ వైసిపి పాలనలో అమూల్య డెయిరీలు పెట్టి పాడి పరిశ్రమను దెబ్బతీసినట్లు విమర్శిం చారు. చంద్రబాబునాయుడు ముఖ్య మంత్రి అయితే పాడి పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ధరల స్థిరీకరణ పథకాన్ని ప్రవేశ పెడతామన్నారు. గ్రామాలలో మౌలిక వసతులు కల్పన, తాగునీరు, సాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. చంద్రబాబుతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు టిడిపిలో చేశారు. డాక్టర్‌ లలిత సాగర్‌, మాగుంట రాఘవరెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండడల అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, శోభారాణి, నాయకులు కోటేశ్వరరావు, వెంకట్రావు, వెంకటేశ్వర్లు, చంద్రం నరసయ్య, పరిటాల సురేష్‌, మార్తల కోటిరెడ్డి, పుచ్చ అచ్చిరెడ్డి, పుల్లారెడ్డి, కోటేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

➡️