గణపతినగర్‌లో గణబాబుకు స్వాగతం

May 8,2024 00:09 #West MLA Ganababu pracharam
Ganababu pracharam

 ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 89వ వార్డు పరిధి గణపతినగర్‌, ఆప్పలనరసింహనగర్‌ కాలనీ, కొత్తపాలెం తదితర ప్రాంతాల్లో టిడిపి, జనసేన నాయకులతో కలిసి కూటమి అభ్యర్థి పెతకంశెట్టి గణబాబు ప్రచారం నిర్వహించారు. అయా గ్రామాల్లో ప్రజలు గణబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు చూపిస్తున్న ఆదరాభిమానం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. ఇక్కడ సమస్యలన్నీ తనకు తెలుసని, కూటమి అధికారంలో రాగానే వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్‌ దాడి వెంకటరమేష్‌, వార్డు అధ్యక్షుడు విజరుకుమార్‌ పాల్గొన్నారు.

➡️